Telugu Global
Others

అంతా మీరే చేశారు!

ఏపీలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న తరహాలో… ఇప్పుడు ముందుకువెళ్తే నిందలు, వెనక్కు తగ్గితే చంద్రబాబు అన్నట్టుగా తయారైంది. సాధారణంగా పాలకుల నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయడం అధికారుల పని. ఏపీలో జరుగుతున్నది కూడా అదే. కానీ నిర్ణయాలు బెడిసికొట్టిన సమయంలో తిరిగి అధికారులపైనే ముఖ్యమంత్రి ఉరుముతుండడంతో యంత్రాంగం బిత్తరపోతోంది. ఇటీవల తాను చేసిన తప్పులను కూడా అధికారులపైకి నెట్టేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. లేటెస్ట్‌గా తీసుకుంటే రాజధాని […]

అంతా మీరే చేశారు!
X

ఏపీలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న తరహాలో… ఇప్పుడు ముందుకువెళ్తే నిందలు, వెనక్కు తగ్గితే చంద్రబాబు అన్నట్టుగా తయారైంది. సాధారణంగా పాలకుల నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయడం అధికారుల పని. ఏపీలో జరుగుతున్నది కూడా అదే. కానీ నిర్ణయాలు బెడిసికొట్టిన సమయంలో తిరిగి అధికారులపైనే ముఖ్యమంత్రి ఉరుముతుండడంతో యంత్రాంగం బిత్తరపోతోంది. ఇటీవల తాను చేసిన తప్పులను కూడా అధికారులపైకి నెట్టేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఉదాహరణలతో సహా చెబుతున్నారు.

లేటెస్ట్‌గా తీసుకుంటే రాజధాని నిర్మాణం కోసం స్కూల్‌ పిల్లల నుంచి పది రూపాయల చొప్పున వసూలు చేయాలంటూ పాఠశాలల హెడ్‌మాస్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి తెలిసే జరిగింది. తొలుత దీనిపై స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు పది రూపాయలే కదా దానికి అంత రచ్చ ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఈ నిర్ణయం ఆయనకు ముందే తెలుసన్న మాట. కానీ పిల్లల నుంచి పది రూపాయలు లాక్కోవాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడడంతో నెపాన్ని అధికారులపైకి నెట్టేశారు. ఇలాంటి ఆదేశాలు ఎలా జారీ చేస్తారంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిత్తరపోవడం అధికారుల వంతు అయింది.

బాక్సైట్‌ జీవో సంగతి మరీ దారుణం. బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం జీవో 97 జారీ చేయడంతో దుమారం రేగింది. వారాల తరబడి ఆందోళనలు సాగాయి. ఇంత జరిగిన తర్వాత ఒక రోజు మంత్రివర్గసమావేశం ఏర్పాటు చేసి అధికారులపై మండిపడ్డారు. జీవో ఎందుకు విడుదల చేశారని ఉత్తరాంధ్ర మంత్రులు నిలదీయగా అసలు జీవో ఎలా వచ్చిందో తనకు తెలియదని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అటవీ శాఖ మంత్రి కూడా బాక్సైట్ జీవో గురించి తనకూ తెలియదని సెలవిచ్చారు. ఈ మాటలు విని తోటి మంత్రులు మనసులో నవ్వుకున్నారు. రాష్ట్రంలో పెనుదుమారం రేపిన బాక్సైట్ జీవో తనకు చెప్పకుండా అధికారులే జారీ చేశారని సీఎం అంటే నమ్మడం సాధ్యమా?. అది కూడా వారాల తరబడి ఆందోళన జరిగిన తర్వాత జీవో గురించి తెలియదంటే ఏమనాలి?. కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు చంద్రబాబుకు మతిమరుపు ఏమైనా వచ్చిందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు జరుగుతున్న జన్మభూమిలోనూ అధికారులు వణికిపోతున్నారు. జన్మభూమిలో ఎక్కువ ఫిర్యాదులు రుణమాఫీ, పించన్లకు సంబంధించినవే. రుణమాపీ కాలేదంటే అందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే కారణం. కానీ అందుకు కూడా అధికారులను తప్పుపడితే ఎలా?. ఇక పించన్ల సంగతి చెప్పాలంటే ఎవరికి పించన్ ఇవ్వాలన్నది ఏపీలో నిర్ణయిస్తున్నది అధికారులు కాదు… టీడీపీ కార్యకర్తలతో నింపబడిన జన్మభూమి కమిటీలు. మరి అర్హతలుండి కూడా పించన్ రాలేదంటే అందుకు జన్మభూమి కమిటీ కార్యకర్తలను తప్పుపట్టాలే గానీ అధికారులను వేదిక మీద నిలబెట్టి తిట్టడం సరైనదేనా. తప్పు పాలకుల వద్ద పెట్టుకుని అధికారులపై నిందలు వేస్తే ఏం లాభం?.

First Published:  8 Jan 2016 9:57 AM IST
Next Story