జయ ఆస్తుల కేసు విచారణకు స్వీకరణ
తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసుపై హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి రెండు నుంచి జయ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు తొలుత జయలలితకు నాలుగేళ్ల జైలు, వంద కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లారు. అయితే కర్నాటక హైకోర్టు జయను నిర్ధోషిగా తేల్చి విడుదల చేసింది. దీంతో […]
తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసుపై హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి రెండు నుంచి జయ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు తొలుత జయలలితకు నాలుగేళ్ల జైలు, వంద కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లారు. అయితే కర్నాటక హైకోర్టు జయను నిర్ధోషిగా తేల్చి విడుదల చేసింది. దీంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం సవాల్ చేసింది. జయ తమిళనాడుకు చెందిన వారైనప్పటికీ కేసు విచారణను బెంగళూరు కోర్టుకు అప్పట్లో బదలాయించారు. కాబట్టి కర్నాటక ప్రభుత్వమే అప్పీల్ చేయాల్సి వచ్చింది.