గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి ఐదున కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 17 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. ఉపసంహరణ గడువు 21వరకు ఉంటుంది. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. షెడ్యూల్ విడుదలతో గ్రేటర్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అటు గ్రేటర్ వార్డుల రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం వార్డుల్లో సగం మహిళలకు కేటాయించారు. […]
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి ఐదున కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 17 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. ఉపసంహరణ గడువు 21వరకు ఉంటుంది. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. షెడ్యూల్ విడుదలతో గ్రేటర్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
అటు గ్రేటర్ వార్డుల రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం వార్డుల్లో సగం మహిళలకు కేటాయించారు. 50 స్థానాలు బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్‌సీలకు 10 వార్డులు కేటాయించారు. ప్రతి కేటగిరిలోనూ సగం స్థానాలు మహిళలకు కేటాయిస్తారు.