సంక్రాంతి పందెం కోడి ఎవరో..!
ఒకప్పుడు సంక్రాంతి పండగ అంటే పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేవి. ముఖ్యంగా మెగాస్టార్, బాలయ్య, నాగార్జున అప్పుడుప్పు వెంకటేష్ సంక్రాంతి కి తమ చిత్రాలు రిలీజ్ చేసేవారు. ఈ నలుగురు సమకాలీనులు. స్టార్ డమ్ వున్న వాళ్లు ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న వాళ్లు. దీంతో ఎవరి చిత్రం రిలీజ్ అయినా..కాస్తా బావుంటే అభిమానులు హిట్ చేసేవారు. ఈ నలుగిరిలో చిరు అందరికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న స్టార్ . ఆయన […]
ఒకప్పుడు సంక్రాంతి పండగ అంటే పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేవి. ముఖ్యంగా మెగాస్టార్, బాలయ్య, నాగార్జున అప్పుడుప్పు వెంకటేష్ సంక్రాంతి కి తమ చిత్రాలు రిలీజ్ చేసేవారు. ఈ నలుగురు సమకాలీనులు. స్టార్ డమ్ వున్న వాళ్లు ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న వాళ్లు. దీంతో ఎవరి చిత్రం రిలీజ్ అయినా..కాస్తా బావుంటే అభిమానులు హిట్ చేసేవారు. ఈ నలుగిరిలో చిరు అందరికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న స్టార్ . ఆయన చిత్రం ఫెయిల్ కావడం అనేది అరుదు. మరి దారుణంగా ఉంటే తప్ప.. ఫెయిల్ అవడం అనేది ఉండేది కాదు.
అయితే సంక్రాంతి పండగ హిట్స్ కొట్టిన హీరోల్లో బాలకృష్ణ ఎక్కువ హిట్స్ అందుకున్న హీరో. సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అయ్యియి. కట్ చేస్తే ప్రజెంట్ సిట్యూయేషన్ వేరు. సీనియర్స్ చిత్రాలు అయినప్పటికి..కథా బలం లేకపోతే ఈ జనరేషన్ ఆడియన్స్ నిర్మోహామాటంగా రెండో రోజు నుంచే థియేటర్ కు రావడం లేదు.
ఈ సంక్రాంతికి డిక్టేటర్ చిత్రంతో బాలకృష్ణ, సోగ్గాడే చిన్ని నాయనా అంటూ నాగార్జున, నాన్నకు ప్రేమతో అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఎక్స్ ప్రెస్ రాజా అంటూ- శర్వానంద్ సంక్రాంతి పండగ బరిలో ఆడియన్స్‌ను అలరించడానికి వస్తున్నారు. అయితే ఈ నాలుగు చిత్రాల్లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పై భారీ అంచనాలున్నాయి. ఆ తరువాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం అంచనాలు క్రియోట్ చేస్తుంది. శర్వానంద్ కూడా కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాడు.. ఎక్స్ ప్రెస్ రాజా అంటూ సిద్దం అయ్యాడు. అయితే కథా బలం వుండి.. బాలయ్య స్టైల్ స్టోరి పడిందంటే డిక్టేటర్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. పరిశీలకులు మాత్రం నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతి హిట్ బరిలో నిలవచ్చు ..సెకండ్ హిట్ గా నాగార్జున చిత్రం నిలబడోచ్చు అనే లెక్కలు వేస్తున్నారు. మరి చివరకు పందెం కోడి ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. బోగి పండగ రోజు అంటే 14న ఎన్టీఆర్ చిత్రం వస్తుంది. ఆ తరువాత మిగిలిన మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.