Telugu Global
Cinema & Entertainment

ఈ యేడాది  మ‌ళ్లీ ర‌జ‌నీకాంతే క్రేజి

పాత సంవ‌త్స‌రం కొన్ని  స‌క్సెస్ లు..ఎన్నో ఫెయిల్యూర్స్ తో  వీడ్కోలు తీసుకుంది. గ‌త యేడాది   రాజ‌మౌళి  డైరెక్ష‌న్ లో వ‌చ్చిన   బాహుబ‌లి చిత్రం   దేశ‌వ్యాప్తంగా  సంచ‌ల‌నం చేసింది. అలాగే  ఆడియ‌న్స్  ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేసిన చిత్రంగా కూడా నిలిచింది.   ఈయేడాది  ద‌క్షణాది స్టార్ హీరోలు చేస్తున్న భారీ ప్రాజ‌క్ట్స్  లో   బాహుబ‌లి  సెకండ్ పార్ట్ త‌రువాత‌…  ఆడియ‌న్స్ వెయిట్ చేస్తున్న చిత్ర‌మంటే   ర‌జ‌నీకాంత్   చేస్తున్న క‌బాలీ సినిమా అనే చెప్పాలి.   గ్యాంగ్ స్ట‌ర్ గా  ర‌జ‌నీకాంత్ […]

ఈ యేడాది  మ‌ళ్లీ ర‌జ‌నీకాంతే క్రేజి
X

పాత సంవ‌త్స‌రం కొన్ని స‌క్సెస్ లు..ఎన్నో ఫెయిల్యూర్స్ తో వీడ్కోలు తీసుకుంది. గ‌త యేడాది రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం చేసింది. అలాగే ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేసిన చిత్రంగా కూడా నిలిచింది. ఈయేడాది ద‌క్షణాది స్టార్ హీరోలు చేస్తున్న భారీ ప్రాజ‌క్ట్స్ లో బాహుబ‌లి సెకండ్ పార్ట్ త‌రువాత‌… ఆడియ‌న్స్ వెయిట్ చేస్తున్న చిత్ర‌మంటే ర‌జ‌నీకాంత్ చేస్తున్న క‌బాలీ సినిమా అనే చెప్పాలి. గ్యాంగ్ స్ట‌ర్ గా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్నారు. మ‌లేషియ నేప‌థ్యంగా క‌థ న‌డుస్తుండ‌టంతో ఎక్కువ భాగం అక్క‌డే షూట్ చేస్తున్నారు.రాధిక ఆప్టే హీరోయిన్. రంజిత్ ద‌ర్శ‌కుడు.ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఫ్యాన్స్ లో భారీ గా అంచ‌నాలు పెంచేస్తోంది.

దీంతో పాటు ర‌జ‌నీకాంత్ , శంక‌ర్ కాంబినేష‌న్‌లో రోబో సీక్వెల్ దాదాపు 4 వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తి నాయ‌కుడిగా చేస్తున్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ గా రోబో 2.0 చిత్రాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ చేస్తున్నాడు. ఇలా రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ర‌జ‌నీకాంతే ఆడియ‌న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మోస్ట్ ఎవైయిటింగ్ హీరోల లిస్ట్ లో నిలుస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. 2014 లో వ‌చ్చిన కొచ్చాడియ‌న్ .. లింగ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్టార్స్ కావ‌డంతో .. మార్కెట్ ప‌రంగా కూడా ర‌జ‌నీ సాబ్ త‌న స‌త్తాను మ‌రోసారి చాటుకోవాల్సిన సంద‌ర్భం ఏర్ప‌డింది. దీంతో కాస్త వ‌య‌సు మీద ప‌డిన‌ప్ప‌టికి రెండు భారీ ప్రాజెక్ట్ తో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీ అయ్యారు మ‌రి.

First Published:  6 Jan 2016 8:37 PM IST
Next Story