మనకీ హక్కులున్నాయి...తెలుసా!
మనకు చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం..అన్నీ పకడ్బందీగా ఉన్నా వాటిపట్ల అవగాహన మాత్రం చాలా తక్కువ. మన పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా సినిమా పాటలు, టీజర్లు, ప్రకటనలంత విరివిగా, విస్తృతంగా ఈ హక్కుల వివరాలు వినిపించవు, కనిపించవు. అందుకే అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్న న్యాయం కూడా మనకు అందని ద్రాక్షలా కనబడుతుంది. భారతీయ పౌరులు అనిపించుకుంటున్న చాలామందికి తెలియని కొన్ని హక్కుల గురించి- గ్యాస్ సిలిండర్ పేలితే సదరు వినియోగదారుడికి 40లక్షలు నష్టపరిహారం పొందే హక్కు ఉంది. […]
మనకు చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం..అన్నీ పకడ్బందీగా ఉన్నా వాటిపట్ల అవగాహన మాత్రం చాలా తక్కువ. మన పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా సినిమా పాటలు, టీజర్లు, ప్రకటనలంత విరివిగా, విస్తృతంగా ఈ హక్కుల వివరాలు వినిపించవు, కనిపించవు. అందుకే అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్న న్యాయం కూడా మనకు అందని ద్రాక్షలా కనబడుతుంది. భారతీయ పౌరులు అనిపించుకుంటున్న చాలామందికి తెలియని కొన్ని హక్కుల గురించి-
- గ్యాస్ సిలిండర్ పేలితే సదరు వినియోగదారుడికి 40లక్షలు నష్టపరిహారం పొందే హక్కు ఉంది.
- అవసరం ఉన్నా పోలీస్ స్టేషన్‌కి వెళ్లకూడదనుకున్న మహిళలు, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
- ఎమ్మార్పీ అంటే మాక్సిమమ్ రిటైల్ ప్రైస్…ప్యాకింగుల మీద కనిపించే ఈ ధరని కచ్ఛితంగా చెల్లించాలని అమ్మకందారులు చెబుతుంటారు. కానీ అది నిజం కాదు. వినియోగదారుడికి ఈ ధరపై బేరమాడే హక్కు ఉంది. మరొక విషయం అమ్మకం దారుడు ఈ ధరను దాటి ఎక్కువ వసూలు చేయకూడదు.
- న్యాయపరమైన ఖర్చులను భరించలేని స్థితిలో ఉంటే ఉచితంగా న్యాయాసహాయం పొందే హక్కు ఉంది.
- లంచం, కట్నం అడగడం ఎంత నేరమో ఇవ్వడమూ అంతే నేరం.
- 6నుండి 16ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యని పొందే హక్కు ఉంది.
- ఒక కేసులో నిందితుడైన వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో నేరాన్ని అంగీకరించినా, అతని అనుమతి లేకుండా ఆ అంగీకారాన్ని పోలీసులు కోర్టులో వెల్లడించకూడదు.
- మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లే ప్రక్రియ అంతటిలో మహిళా పోలీసులే ఉండాలి.
- సూర్యాస్తమయం తరువాత మహిళలను అరెస్టు చేయకూడదు.
- రేప్, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు తమ పేరుని, ఉనికిని వెల్లడించకుండా ఉండే హక్కు ఉంది. స్టేట్‌మెంట్ తీసుకోవడానికి వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కి పిలిచే అధికారం పోలీసులకు లేదు.
- ఉద్యోగిని గర్భవతి అయి ఉంటే, ఆమె శక్తికి మించిన పనిని అప్పగించకూడదు. గర్భవతులకు 12వారాలు ప్రసూతి సెలవుని పొందే హక్కు ఉంది.
- బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం నేరం కాదు.
- కొడుకులతో పాటు కూతుళ్లకు సమానంగా వారసత్వపు హక్కులు ఉంటాయి.
- చట్టాలు తెలియకపోవడం వలన నేరం చేశామంటే కుదరదు. అలాంటి సందర్భాల్లోనూ శిక్ష తప్పనిసరి.
హక్కులు, చట్టాల పట్ల, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ లెక్స్‌డూఇట్.కామ్ ఈ వివరాలను అందించింది. ఇది ఢిల్లీలో ఉంది. ప్రజలకు న్యాయపరమైన అంశాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ ఎన్నో రకాలుగా ప్రచార కార్యక్రమాలను రూపొందించి సమాజంలోకి తీసుకువెళుతోంది.