ఐదుగురు ఎమ్మెల్యేల జంపింగ్ ఉత్తిదే?
వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందన్న అనుమానాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన చంద్రబాబు.. కర్నూలు జిల్లాలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నట్టు నేతలతో చెప్పారని టీడీపీ అనుకూల ప్రతిక గురువారం పెద్ద కథనాన్ని రాసింది. వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సూచించారని కూడా వెల్లడించింది. అంతేకాదు సంక్రాంతిలోపే చేరికలు ఉంటాయని టైమ్‌లైన్ కూడా ప్రచురించారు. అయితే అదే పత్రిక […]
వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందన్న అనుమానాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన చంద్రబాబు.. కర్నూలు జిల్లాలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నట్టు నేతలతో చెప్పారని టీడీపీ అనుకూల ప్రతిక గురువారం పెద్ద కథనాన్ని రాసింది. వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సూచించారని కూడా వెల్లడించింది. అంతేకాదు సంక్రాంతిలోపే చేరికలు ఉంటాయని టైమ్‌లైన్ కూడా ప్రచురించారు. అయితే అదే పత్రిక శుక్రవారం కొత్త లైన్ తీసుకుంది.
పార్టీ మారడంపై ఐదుగురు ఎమ్మెల్యేలు కాస్త వెనక్కు తగ్గారని తాజాగా అదే పత్రికలో కథనం. ఎందుకు తగ్గారన్న దానికి కూడా కారణం వెల్లడించింది. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న విషయం తెలియగానే వారికి ఫోన్ చేసి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎలా పార్టీ మారుతారో చూస్తా అంటూ బెదిరించారని రాశారు. అయితే ఈ కారణం కాస్త అనుమానంగా అనిపిస్తోంది. ఎందుకంటే అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధమైన వారిని బెదిరిస్తే ఆగుతారు?. బుజ్జగించారంటే అర్థముంది కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎమ్మెల్యేలను బెదిరించారంటే అది ఎంతవరకు నిజమో!. ఎమ్మెల్యేల జంపింగ్ విషయాన్ని వైసీపీ నేతలు చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. 2014 ఎన్నికల ముగిసిన రెండు మూడు నెలలకే ఇదే మీడియా సంస్థ ఏకంగా 32 ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నట్టుగా రెండుమూడు రోజులు హడావుడి చేసిందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వైసీపీ నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే అని బయటకు వెళ్లారా?…. అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ మైండ్‌గేమ్‌లో ఒక భాగమని చెబుతున్నారు.
Click to Read: