Telugu Global
Others

పటాన్‌చెరు స్థానానికి ఉప ఎన్నిక తప్పదా?

పటాన్‌చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కష్టాల్లో పడ్డారు. పటన్‌చెరులోని ఒక కంపెనీ యాజమానిపై దాడి చేసిన ఘటనలో ఇటీవల ఆయనకు సంగారెడ్డి సెషన్స్ కోర్టు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. దీంతో ప్రజాప్రాతినిధ్యం చట్టంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మహిపాల్‌ రెడ్డి ఆటోమెటిక్‌గా ఎమ్మెల్యే పదవి కోల్పోయినట్టేనని చెబుతున్నారు.  రెండేళ్లకు మించి శిక్షపడితే సదరు ప్రజాప్రతినిధిపై ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుందని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండున్నర ఏళ్లు జైలు శిక్ష […]

పటాన్‌చెరు స్థానానికి ఉప ఎన్నిక తప్పదా?
X

పటాన్‌చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కష్టాల్లో పడ్డారు. పటన్‌చెరులోని ఒక కంపెనీ యాజమానిపై దాడి చేసిన ఘటనలో ఇటీవల ఆయనకు సంగారెడ్డి సెషన్స్ కోర్టు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. దీంతో ప్రజాప్రాతినిధ్యం చట్టంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మహిపాల్‌ రెడ్డి ఆటోమెటిక్‌గా ఎమ్మెల్యే పదవి కోల్పోయినట్టేనని చెబుతున్నారు. రెండేళ్లకు మించి శిక్షపడితే సదరు ప్రజాప్రతినిధిపై ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుందని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండున్నర ఏళ్లు జైలు శిక్ష పడ్డ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పో్యినట్టేనని చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై రఘునంద్‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. రెండున్నరేళ్లు జైలు శిక్ష పడినందున ఎమ్మెల్యే పదవికి అనర్హుడని… అయినప్పటికీ మహిపాల్ రెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ జీతం చెల్లిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. మహిపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించడంతో పాటు జీతం చెల్లించిన అసెంబ్లీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

First Published:  5 Jan 2016 2:06 AM GMT
Next Story