కేశవ వర్సెస్ విశ్వేశ్వర " తలపడినంత పనైంది
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రచ్చ రేపింది. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఇద్దరూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకుంటారా అన్న స్థాయిలో వాగ్వాదానికి దిగారు. నేతలే ఆ రేంజ్‌లో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా?. తోపులాటకు దిగారు. కూర్చీలు విరగొట్టేశారు. చివరకు పోలీసులు ఇరు వర్గాలను తరిమికొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. హవళిగి గ్రామంలో 2014కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని కేవలం టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే ఇస్తున్నారని తమకు ఇవ్వడం లేదని కొందరు వైసీపీ వర్గీయులు […]
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రచ్చ రేపింది. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఇద్దరూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకుంటారా అన్న స్థాయిలో వాగ్వాదానికి దిగారు. నేతలే ఆ రేంజ్‌లో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా?. తోపులాటకు దిగారు. కూర్చీలు విరగొట్టేశారు. చివరకు పోలీసులు ఇరు వర్గాలను తరిమికొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
హవళిగి గ్రామంలో 2014కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని కేవలం టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే ఇస్తున్నారని తమకు ఇవ్వడం లేదని కొందరు వైసీపీ వర్గీయులు కార్యక్రమంలో అధికారుల దృష్టికి తెచ్చారు. వారికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఇలా రైతుల విషయంలో రాజకీయాలేంటని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. అయితే అధికారులు సమాధానం చెప్పకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్లపైనా సమాధానం చెప్పాలంటూ కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఇది కాస్త ముదిరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
ఇన్‌పుట్ సబ్సిడీ అక్రమాలపై జాయింట్ కలెక్టర్ చేత విచారణ జరిపించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు పయ్యావుల అభ్యంతరం చెప్పారు. ఒకరిద్దరికి సబ్సిడీ అందకపోయినంత మాత్రాన ఏకంగా విచారణ కమిటీ వేయాలా అని ప్రశ్నించారు. తప్పులు గత ప్రభుత్వంలోనే జరిగాయని… తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పయ్యావుల చెప్పారు. ఇలా చాలాసేపు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వారిని శాంతింప చేయడం అక్కడున్న అధికారుల వల్ల కూడా కాలేదు. దీంతో కార్యకర్తలను తొలుత పోలీసులు తరమికొట్టారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే విశ్వశ్వరరెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పయ్యావుల, విశ్వేశ్వరరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు.