Telugu Global
Others

చింటూ, పావని- ఒకరికొకరు

చిత్తూరు జిల్లా మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పావని అనే మహిళకు చింటూ అండగా ఉండేవారని పోలీసులు గుర్తించారు. చింటూ అండ చూసుకుని పావని రెచ్చిపోయేదని తెలుసుకున్నారు. పైకి చీరల వ్యాపారం చేస్తున్నట్టు చెప్పే పావని అప్పులు చేసి చుట్టుపక్కల మహిళకు చుక్కులు చూపించింది. చీరల వ్యాపారం చేస్తున్నట్టు చెప్పే పావని… మూడేళ్లుగా చిత్తూరు నగరంలోని పలువురు మహిళల నుంచి నగదు, నగలు తీసుకుంది. […]

చింటూ, పావని- ఒకరికొకరు
X

చిత్తూరు జిల్లా మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పావని అనే మహిళకు చింటూ అండగా ఉండేవారని పోలీసులు గుర్తించారు. చింటూ అండ చూసుకుని పావని రెచ్చిపోయేదని తెలుసుకున్నారు. పైకి చీరల వ్యాపారం చేస్తున్నట్టు చెప్పే పావని అప్పులు చేసి చుట్టుపక్కల మహిళకు చుక్కులు చూపించింది. చీరల వ్యాపారం చేస్తున్నట్టు చెప్పే పావని… మూడేళ్లుగా చిత్తూరు నగరంలోని పలువురు మహిళల నుంచి నగదు, నగలు తీసుకుంది. అవసరం ఉందంటూ నగలు తీసుకుని ఆ తర్వాత వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు విచారణలో తేలింది. అలా తీసుకున్న నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదవపెట్టేసింది.

అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ నగలను వేలంలో అమ్మేసింది. ఇలా ఊర్లోవారికి చెందిన ఎనిమిది కిలోల బంగారం తీసుకెళ్లి మాయం చేసింది పావని. అయితే తాకట్టు పెట్టిన బంగారంలో సగం ఈమె విడిపించుకున్నట్టు భావిస్తున్నారు. విషయం తెలిసి బాధితులు నిలదీయగా చింటూ చెంతకు చేరింది పావని. చింటూ సాయంతో బాధితులను భయపెట్టి బెదరగొట్టింది. అప్పటి నుంచి చింటూ, పావని మధ్య బంధం మరింత బలపడిందని చెబుతున్నారు. అనురాధ హత్య కేసులో చింటూను విచారించిన సమయంలో పావని సంగతి కూడా వెలుగు చూసింది. మేయర్ దంపతులను హత్య చేసిన తర్వాత చింటూ … పావని దగ్గరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పావనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  5 Jan 2016 4:40 AM IST
Next Story