తేనె పూసిన కత్తులతో జాగ్రత్త- సిబ్బందికి ఆర్మీ సూచనలు
ఉగ్రవాద సంస్థలు ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు ఇటీవల అమ్మాయిలను ప్రయోగిస్తున్నాయి. సదరు తేనెపూసిన కత్తులైన అమ్మాయిలు కొందరు ఆర్మీ సిబ్బందితో ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా పరిచయం ఏర్పరచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అధికారులకు అందాలను చూపిస్తూ వలవిసురుతున్నారు. మాటల్లో పెట్టి, అమయాకంగా నటిస్తూ ఆర్మీ, దేశ భద్రతకు సంబంధించిన విషయాలను రాబడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. దీంతో ఆర్మీ అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో ఎలా వ్యవహరించాలన్న దానిపై సిబ్బందికి 10 […]
ఉగ్రవాద సంస్థలు ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు ఇటీవల అమ్మాయిలను ప్రయోగిస్తున్నాయి. సదరు తేనెపూసిన కత్తులైన అమ్మాయిలు కొందరు ఆర్మీ సిబ్బందితో ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా పరిచయం ఏర్పరచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అధికారులకు అందాలను చూపిస్తూ వలవిసురుతున్నారు. మాటల్లో పెట్టి, అమయాకంగా నటిస్తూ ఆర్మీ, దేశ భద్రతకు సంబంధించిన విషయాలను రాబడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. దీంతో ఆర్మీ అప్రమత్తమైంది.
సోషల్ మీడియాలో ఎలా వ్యవహరించాలన్న దానిపై సిబ్బందికి 10 కీలక సూచనలతో నోట్ పంపింది. ఫేస్‌బుక్, ఇతర సోషల్ సైట్లతో అశ్లీల దృశ్యాలను చూడవద్దని హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించవద్దని సూచించింది. ఉద్యోగ హోదా, పని చేస్తున్న ప్రదేశం వంటి వివరాలను బహిర్గతం చేయవద్దని నోట్ పంపారు. ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా వాడవద్దని ఉన్నాతాధికారులు సూచించారు. ఇలాంటి వివరాలను కుటుంబసభ్యులు కూడా బయటపెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు.
ఆర్మీకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లో స్టోర్ చేయవద్దని తమ సిబ్బందికి ఆర్మీ సూచించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల సాయంతో సమాచారం సేకరణకు అవకాశం ఉంటుందని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నోట్‌లో సూచించారు.