ఆడియో టేపు కలకలం- అడ్డంగా బుక్కయిన గోషామహల్ ఎమ్మెల్యే
రాజాసింగ్ నియోజకవర్గ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో ఒక వ్యక్తి తన ఇంటి వద్ద బోర్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదంటూ రెవెన్యూ అధికారులు వచ్చి ఆపేశారు. కేసు పెడుతామంటూ బెదిరించారు. దీంతో సదరు వ్యక్తి తనకు ఎమ్మెల్యే రాజాసింగ్ బాగా తెలుసంటూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. తొలుత ఎమ్మెల్యేతో మాట్లాడిన సదరు వ్యక్తి ”సార్ బోర్ వేస్తుంటే అధికారులు అడ్డుపడుతున్నారు. మీరు కాస్త చెప్పండి ” అంటూ కోరారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ […]
రాజాసింగ్ నియోజకవర్గ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో ఒక వ్యక్తి తన ఇంటి వద్ద బోర్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదంటూ రెవెన్యూ అధికారులు వచ్చి ఆపేశారు. కేసు పెడుతామంటూ బెదిరించారు. దీంతో సదరు వ్యక్తి తనకు ఎమ్మెల్యే రాజాసింగ్ బాగా తెలుసంటూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. తొలుత ఎమ్మెల్యేతో మాట్లాడిన సదరు వ్యక్తి ”సార్ బోర్ వేస్తుంటే అధికారులు అడ్డుపడుతున్నారు. మీరు కాస్త చెప్పండి ” అంటూ కోరారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ సదరు అధికారికి ఇవ్వమని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడాక తన పని అయిపోయినట్టే అనుకుని రెవెన్యూ అధికారికి ఫోన్ ఇచ్చాడు సదరు వ్యక్తి. ఇక్కడే ఎమ్మెల్యేలోని మరో వ్యక్తి బయటకు వచ్చారు.
బోర్ వేసుకుంటున్న వ్యక్తిని వదిలిపెట్టవద్దని రెవెన్యూ అధికారికి రాజాసింగ్ సూచించారు. ”వాడు గలీజు ల…. కొడుకు. వదిలిపెట్టవద్దు. కేసు పెడుతావా పెట్టు. ఎంత ఫైన్ వేయగలరో వేయండి. ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టవద్దు” అని ఎగదోశారు. ఎమ్మెల్యే చెప్పినా వినే ప్రసక్తే లేదని కూడా చెప్పాలని నూరిపోశారు. అయితే తాను ఇలా చెప్పినట్టు మాత్రం సదరు వ్యక్తికి చెప్పవద్దని అధికారికి ఎమ్మెల్యే సూచించారు.
ఇంకేం అధికారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కాదు ఎవరు చెప్పినా వినేప్రసక్తే లేదంటూ బోర్ వేయకుండా అడ్డుపడ్డారు. అయితే ఎమ్మెల్యే ఇక్కడో విషయం మరిచిపోయారు. ఈ సంభాషణంతా ఆటోమెటిక్ రికార్డు సిస్టమ్ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డయింది. అనంతరం ఈ సంభాషణ విన్న బాధితుడు బిత్తరపోయాడు. ఎవరు వదిలారో గానీ ఈ సంభాషణ ఇప్పుడు వాట్సాప్‌లో షికార్లు చేస్తోంది. ఇది ఎమ్మెల్యే కొంపముంచేంతా సీరియస్ మ్యాటర్ కాకపోయినా… రాజాసింగ్ వ్యక్తిత్వంపై ఇతరులకు భవిష్యత్తులో అనుమానం కలిగేలా చేసింది.
Click to Read :