బాబు నాకు బంధువే... కానీ పని జరగలేదు
రైతు రుణమాఫీ అంశం చంద్రబాబును వెంటాడుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో ఆయనకు చికాకు కలిగిస్తూనే ఉంది. విడతల వారీగా మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోనూ ఇదే అనుభవం ఎదురైంది అధికారులకు. ఎవరో రుణమాఫీ జరగలేదనిఉంటే పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ చంద్రబాబు సమీప బంధువు నాగరాజు నాయుడే అధికారులను జన్మభూమి కార్యక్రమంలో నిలదీశారు. తనకు రూ. 40 వేల […]

రైతు రుణమాఫీ అంశం చంద్రబాబును వెంటాడుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో ఆయనకు చికాకు కలిగిస్తూనే ఉంది. విడతల వారీగా మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోనూ ఇదే అనుభవం ఎదురైంది అధికారులకు. ఎవరో రుణమాఫీ జరగలేదనిఉంటే పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ చంద్రబాబు సమీప బంధువు నాగరాజు నాయుడే అధికారులను జన్మభూమి కార్యక్రమంలో నిలదీశారు. తనకు రూ. 40 వేల అప్పు ఉందని మాఫీమాత్రం జరగలేదన్నారు. నిజానికి రూ. 50 వేల లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాగరాజు నాయుడి అప్పు రూ. 40 వేలే అయినా మాఫీ జరగలేదు. దీనిపై అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పైగా నాగరాజు నాయుడు చంద్రబాబు బంధువు మరీ.