Telugu Global
NEWS

అనిత భర్త ఇల్లీగల్ బిజినెస్ చేశారా?

రోజాకు పోటీగా టీడీపీ తనను ముందుంచుతోందన్న అభిప్రాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని రోజా తిడుతుంటే తానే చూడలేక స్పందించానన్నారు. రోజా వ్యాఖ్యలు తనకు చాలా బాధకలిగించాయని ఆవేదన చెందారామె.  నియోజకవర్గ పనుల కోసమే తాను హైదరాబాద్‌లో ఉండకతప్పడం లేదన్నారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు 200 కోట్లు తీసుకొచ్చానని చెప్పారామె. భర్త నుంచి విడిపోవడంపైనా స్పందించారు. అదంతా తలరాత అనుకోవాలన్నారు. తాను రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే తన భర్త సూపర్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారని […]

అనిత భర్త ఇల్లీగల్ బిజినెస్ చేశారా?
X

రోజాకు పోటీగా టీడీపీ తనను ముందుంచుతోందన్న అభిప్రాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని రోజా తిడుతుంటే తానే చూడలేక స్పందించానన్నారు. రోజా వ్యాఖ్యలు తనకు చాలా బాధకలిగించాయని ఆవేదన చెందారామె. నియోజకవర్గ పనుల కోసమే తాను హైదరాబాద్‌లో ఉండకతప్పడం లేదన్నారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు 200 కోట్లు తీసుకొచ్చానని చెప్పారామె. భర్త నుంచి విడిపోవడంపైనా స్పందించారు. అదంతా తలరాత అనుకోవాలన్నారు. తాను రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే తన భర్త సూపర్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారని అది తనకు నచ్చలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేయవద్దని భర్తను కోరినట్టు చెప్పారామె. అయినా ఆయన వినలేదని అందుకే విడాకులకు అప్లయి చేశానన్నారు. అతడిని అలాగే భరిస్తే నా భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె అన్నారు. అనితది ప్రేమ వివాహం. వీరి పెళ్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. అయితే ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

First Published:  3 Jan 2016 6:16 AM IST
Next Story