వీరప్పన్ ఎందుకు వెనక్కు వెళ్లాడు..!
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. శ్రీకృష్ణ క్రియేషన్స్ సమర్పణలో జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్ సంస్థలపై ఈ చిత్రాన్నిబీవీ మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి ఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ జనవరి 1న కన్నడ, తెలుగు వెర్షన్లలో రిలీజ్ అవ్వాల్సిన ‘కిల్లింగ్ వీరప్పన్ ‘ కన్నడ వెర్షన్ రిలీజ్ అయ్యి, తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీచేసే […]
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. శ్రీకృష్ణ క్రియేషన్స్ సమర్పణలో జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్ సంస్థలపై ఈ చిత్రాన్నిబీవీ మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి ఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ జనవరి 1న కన్నడ, తెలుగు వెర్షన్లలో రిలీజ్ అవ్వాల్సిన ‘కిల్లింగ్ వీరప్పన్ ‘ కన్నడ వెర్షన్ రిలీజ్ అయ్యి, తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీచేసే ప్రాసెస్ లో ఉన్నా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల డిలే అవ్వడం జరిగింది..దాని మూలాన సినిమా పోస్ట్ పోన్ చెయ్యడం జరిగింది …ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని జనవరి 7న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
అయితే సినిమా కన్నడ వెర్షన్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.కన్నడ సినిమా ప్రముఖులు అందరు కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని వీక్షించినట్లు తెలుస్తుంది. దీంతో సినిమా కు మరింత క్రేజ్ పెరిగింది. మొత్తం మీద వర్మ సాబ్‌కు కాస్త బూస్టింగ్ వచ్చినట్లే మరి. ఎందుకంటే ఈ మధ్య వర్మ చేసిన చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి మరి.