పెద్దలు కుదిర్చిన పెళ్లి.. సర్దుకుపోవాలి " రేవంత్ హితబోధ
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ఆంధ్రవాళ్లు కూడా తమవారేనని కేసీఆర్, కేటీఆర్ చెప్పడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందన్న కేసీఆర్… అమరావతి శంకుస్థాపనకు వెళ్లి అదే బిర్యానీ తినివచ్చారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వచ్చాయి కాబట్టే టీఆర్ఎస్ నేతలకు ఆంధ్రా ఓటర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. దమ్ముంటే మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు. కేటీఆర్ ఈ అంశాన్ని కేబినెట్ మీటింగ్‌లో […]
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ఆంధ్రవాళ్లు కూడా తమవారేనని కేసీఆర్, కేటీఆర్ చెప్పడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందన్న కేసీఆర్… అమరావతి శంకుస్థాపనకు వెళ్లి అదే బిర్యానీ తినివచ్చారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వచ్చాయి కాబట్టే టీఆర్ఎస్ నేతలకు ఆంధ్రా ఓటర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. దమ్ముంటే మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ ఈ అంశాన్ని కేబినెట్ మీటింగ్‌లో చర్చకు తెచ్చి ఆమోదం పొందేలా చూడాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు కడుపులో కత్తులు పెట్టుకుని ఆంధ్రవాళ్లను కౌగిలించుకుంటున్నారని నమ్మడానికి ఇక్కడ అమాయకులు ఎవరూ లేరన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌కు పనైపోయిందన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెద్దలు కుదిర్చిన పెళ్లి లాంటిదన్నారు. కాబట్టి ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలని టీడీపీ శ్రేణులకు రేవంత్ సూచించారు.
Click to Read: