తమిళనాట రెట్టింపైన రజనీ సంబరం
అసలే వానలు-వరదలు… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనం…. మరోవైపు శింబు బీప్ సాంగ్ వివాదం… ఇలా తమిళనాట అంతా స్తబ్దుగా ఉంది. ఇలాంటి వాతావరణం మధ్యలో శంకర్-రజనీకాంత్ సినిమా ప్రారంభమైనప్పటికీ పెద్దగా ఎవరూ దాని గురించి చర్చించుకోలేదు. కానీ ఇప్పుడు కోలుకున్న తమిళనాట… రజనీకాంత్ పెద్ద సంచలనమే సృష్టించాడు. న్యూ ఇయర్ సందర్భంగా…. తన కొత్త సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్ విడుదల చేశాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రోబో సీక్వెల్….. చిట్టి 2.0 సినిమాకు సంబంధించి దర్శకుడితో […]
BY sarvi1 Jan 2016 6:32 PM IST

X
sarvi Updated On: 2 Jan 2016 6:03 AM IST
అసలే వానలు-వరదలు… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనం…. మరోవైపు శింబు బీప్ సాంగ్ వివాదం… ఇలా తమిళనాట అంతా స్తబ్దుగా ఉంది. ఇలాంటి వాతావరణం మధ్యలో శంకర్-రజనీకాంత్ సినిమా ప్రారంభమైనప్పటికీ పెద్దగా ఎవరూ దాని గురించి చర్చించుకోలేదు. కానీ ఇప్పుడు కోలుకున్న తమిళనాట… రజనీకాంత్ పెద్ద సంచలనమే సృష్టించాడు. న్యూ ఇయర్ సందర్భంగా…. తన కొత్త సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్ విడుదల చేశాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రోబో సీక్వెల్….. చిట్టి 2.0 సినిమాకు సంబంధించి దర్శకుడితో రజనీకాంత్ దిగిన ఫోటో జనవరి 1న విడుదలైంది. ఈ ఒక్క స్టిల్ తో అభిమానులు పండగ చేసుకున్నారు. రోబో సినిమాలో రజనీకాంత్ గెటప్ ఎలా ఉందో… చిట్టి 2.0లో కూడా రజనీకాంత్ అదే గెటపల్ లో కనిపించాడు. ఓవైపు దర్శకుడు ఇచ్చే సూచనల్ని సీరియస్ గా పాటిస్తున్నారు. అంతేకాదు… 2.0 అనే అర్థం వచ్చేలా…. 2016ను…. 2.0 16 అని టైప్ చేసి మరీ ఫస్ట్ లుక్ ఫొటోను విడుదల చేయడం విశేషం.
Next Story