పంజాబ్ లో ఉగ్రదాడి- నలుగురు టెర్రరిస్ట్ లు హతం
పంజాబ్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై తెల్లవారుజామున ఉగ్రమూకలు దాడికి తెగబడ్డారు. ఆర్మీ డ్రస్ లో వచ్చిన టెర్రరిస్ట్ లు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై ఎదరుదాడి చేశాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. ఉగ్రవాదులపై ఆపరేషన్ ముగిసినట్టు ఆర్మీ ప్రకటించింది. ఉగ్రవాదులు పాక్ లోని […]
BY sarvi2 Jan 2016 6:38 AM IST
X
sarvi Updated On: 2 Jan 2016 7:38 AM IST
పంజాబ్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై తెల్లవారుజామున ఉగ్రమూకలు దాడికి తెగబడ్డారు. ఆర్మీ డ్రస్ లో వచ్చిన టెర్రరిస్ట్ లు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై ఎదరుదాడి చేశాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. ఉగ్రవాదులపై ఆపరేషన్ ముగిసినట్టు ఆర్మీ ప్రకటించింది. ఉగ్రవాదులు పాక్ లోని జైషేమహ్మద్ గ్రూపు సభ్యులుగా ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దాడికి ముందు పలు టెలిఫోన్ బూత్ ల నుంచి చేసిన కాల్స్ లో నాలుగు పాకిస్థాన్ కు వెళ్లాయని గుర్తించారు. ఎయిర్ బేస్ స్థావరంపై దాడే లక్ష్యంగా టెర్రరిస్ట్ లు వచ్చినట్టు నిర్ధారించారు. మరోవైపు తాజా ఘటనపై పాక్ జాతీయ సలహాదారుతో భారత జాతీయ సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడనున్నారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించారు. భద్రతా దళాలు టెర్రరిస్ట్ ల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారన్నారు.
మూడు రోజుల క్రితమే పంజాబ్ సరిహద్దులు దాటి టెర్రరిస్ట్ లు వచ్చినట్టు తెలుస్తోంది. నిన్న పఠాన్‌కోట్‌లో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎస్పీ కిడ్నాప్ వెనుక టెర్రరిస్ట్ ల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో పంజాబ్ లో ఉగ్రదాడులు జరగడం ఇది రెండోసారి. జులై 27న గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌పై టెర్రరిస్ట్ లు దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు చనిపోయారు. భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించి ముగ్గురు టెర్రరిస్ట్ లను చంపేశాయి.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి నేపథ్యంలో దేశ రాజధానిలో ఢిల్లీలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టు, రద్దీ ప్రదేశాల్లో భద్రతను పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది కూడా గస్తీ తిరుగుతున్నారు. ఇటు హైదరాబాద్ లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ పంపుతున్నారు.
Next Story