Telugu Global
Others

నిజామాబాద్ ఎమ్మెల్సీ రూ. 2 కోట్లకు అమ్మకం

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంచలన ఆరోపణ వెలుగు చూసింది. ఎన్నికల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ టికెట్ కోసం రూ. 2 కోట్లు ఇచ్చినట్టు కాంగ్రెస్ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. రెండు కోట్లు ఇచ్చాక కూడా మరో కోటిన్నర డిమాండ్ చేశారని ఆయన వెల్లడించారు. మరో కోటిన్నర ఇవ్వలేక నామినేషన్ వెనక్కు తీసుకున్నట్టు చెప్పారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సమక్షంలోనే డబ్బుఅందజేశానని వెంకటరమణారెడ్డి […]

నిజామాబాద్ ఎమ్మెల్సీ రూ. 2 కోట్లకు అమ్మకం
X

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంచలన ఆరోపణ వెలుగు చూసింది. ఎన్నికల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ టికెట్ కోసం రూ. 2 కోట్లు ఇచ్చినట్టు కాంగ్రెస్ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. రెండు కోట్లు ఇచ్చాక కూడా మరో కోటిన్నర డిమాండ్ చేశారని ఆయన వెల్లడించారు. మరో కోటిన్నర ఇవ్వలేక నామినేషన్ వెనక్కు తీసుకున్నట్టు చెప్పారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సమక్షంలోనే డబ్బుఅందజేశానని వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ఈ డబ్బును షబ్బీర్‌ అలీ తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు.

ఎన్నికల్లో ఓటర్లకు పంచుతామని చెప్పిన నేతలు ఇప్పుడు రెండు కోట్లను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా నేతలు స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ కూడా రాశానన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఒకవేళ తాను డబ్బులివ్వడం తప్పు అయితే శిక్ష అనుభవించేందుకు సిద్ధమన్నారు. అదే సమయంలో ఓటర్లకు డబ్బు పంచుతామంటూ టికెట్ అమ్మిన నాయకులకూ కఠిన శిక్ష పడాలన్నారు వెంకటరమణారెడ్డి.

First Published:  2 Jan 2016 4:26 AM GMT
Next Story