ఫ్యూచర్ కళ్ల ముందు కనిపిస్తోంది!
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు అగ్రనేతలకు సైతం వణుకుపుట్టిస్తోంది. శ్రేణులు ఇప్పటికే చెల్లాచెదురవగా నాయకులు సైతం భవిష్యత్తు తలచుకుని హడలిపోతున్నారు. మొన్నటి వరంగల్ ఉప ఎన్నిక తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిద్రపట్టని పరిస్థితి. ఎర్రబెల్లి నియోజకర్గంలో టీఆర్ఎస్‌కు ఏకంగా 34 వేల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ చూసిన తర్వాత 2019 ఎన్నికల్లో తన పరిస్థితి ఏమవుతుందోనని ఆయన ఆందోళనగా ఉన్నారు. పైకి అధికార దుర్వినియోగం చేసి వరంగల్‌లో టీఆర్ఎస్ గెలిచిందని చెబుతున్నా అసలు […]
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు అగ్రనేతలకు సైతం వణుకుపుట్టిస్తోంది. శ్రేణులు ఇప్పటికే చెల్లాచెదురవగా నాయకులు సైతం భవిష్యత్తు తలచుకుని హడలిపోతున్నారు. మొన్నటి వరంగల్ ఉప ఎన్నిక తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిద్రపట్టని పరిస్థితి. ఎర్రబెల్లి నియోజకర్గంలో టీఆర్ఎస్‌కు ఏకంగా 34 వేల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ చూసిన తర్వాత 2019 ఎన్నికల్లో తన పరిస్థితి ఏమవుతుందోనని ఆయన ఆందోళనగా ఉన్నారు. పైకి అధికార దుర్వినియోగం చేసి వరంగల్‌లో టీఆర్ఎస్ గెలిచిందని చెబుతున్నా అసలు నిజం ఆయనకు తెలుసంటున్నారు.
తన నియోజకవర్గంలో ఓట్లు చీలడానికి డిప్యూటీ సీఎం కడియం వ్యూహాలే కారణమని ఎర్రబెల్లి భావిస్తున్నారట. కడియం శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లిని ఏమాత్రం ఖాతరు చేయకుండా నేరుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్డంతోపాటు నిధులు కూడా ఎర్రబెల్లికి తెలియకుండానే ఖర్చు పెట్టించారట. ఎర్రబెల్లి దగ్గరకు వెళ్తే పని జరగదు అన్నఅభిప్రాయం ప్రజల్లో కలిగేలా కడియం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓటమే లక్ష్యంగా కడియం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.
పరిస్థితి ఇలాగే ఉంటే రానురాను నియోజకవర్గంలో జనం తనను పట్టించుకోరేమోనన్న ఆందోళన ఎర్రబెల్లిలో కనిపిస్తోంది. ఉప ఎన్నిక ముగిసి నెలరోజులు దాటినా ఆ షాక్ నుంచి ఎర్రబెల్లి మాత్రం తేరుకోలేకపోతున్నారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వరంగల్ లో జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారట ఎర్రబెల్లి. మొత్తం మీద తన సొంత నియోజకవర్గం పాలకుర్తిలోనూ టీఆర్ఎస్ పాగా వేయడంతో 2019 నాటికి ఏం జరగబోతోందోనన్న ఆందోళన ఎర్రబెల్లిలో మొదలైందన్న మాట.