జేసీ వ్యంగ్యం అర్థమైందా బాబులూ?
అనంతపురం నీరు ప్రగతి కార్యక్రమంలో జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ”ఓరేయ్.. నీ అబ్బా ఇలా అయితే ఎప్పుడు సీఎం అవుతావురా” అంటూ జేసీ జగన్‌ను ఘాటుగా ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశంలో విహరింప చేశారు. అయితే జేసీ మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో జగన్‌కు దిశానిర్దేశం చేసినట్టుగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ”ఇలా అయితే ఎప్పుడు సీఎం అవుతావ్” అంటూ ప్రశ్నించడం […]
అనంతపురం నీరు ప్రగతి కార్యక్రమంలో జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ”ఓరేయ్.. నీ అబ్బా ఇలా అయితే ఎప్పుడు సీఎం అవుతావురా” అంటూ జేసీ జగన్‌ను ఘాటుగా ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశంలో విహరింప చేశారు. అయితే జేసీ మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో జగన్‌కు దిశానిర్దేశం చేసినట్టుగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ”ఇలా అయితే ఎప్పుడు సీఎం అవుతావ్” అంటూ ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వంపై దాడి తీవ్రతను పెంచమని సలహా ఇచ్చినట్టుగా ఉందంటున్నారు. పైగా పదేపదే ”మావాడు జగన్, మావాడు జగన్” అంటూ చంద్రబాబు సమక్షంలోనే జేసీ అనడం కూడా పరిశీలించాల్సిన అంశమే. ఈ విషయం అర్థమయ్యే జేసీ ఎంతగా పొగుడుతున్నా చంద్రబాబు మాత్రం సీరియస్‌గానే చూస్తూ ఉండిపోయారని చెబుతున్నారు.
పైగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు ఇచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం మరే ముఖ్యమంత్రి చేయడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. అయితే ఇది చంద్రబాబుపై వేసిన సెటైర్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమవారు గగ్గోలు పెడుతున్నా, నీటిమట్టం కనిష్ట స్థాయి కంటే దిగువకు పడిపోయినా, శ్రీశైలం నుంచి పదేపదే నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు నీరు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పడం వ్యంగ్యంగా మాట్లాడటం కాకమరేంటని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ నీటి అంశాన్ని ప్రస్తావించి జగన్‌ను జేసీ విమర్శించడాన్ని బట్టి చూస్తుంటే సీమ నీటి కోసం పోరాటం చేయాల్సిందిగా సలహా ఇచ్చినట్టు ఉందంటున్నారు. జగన్‌పై జేసీకి ప్రేమ ఉంది కాబట్టే ఓరేయ్ అంటూ తిట్టగలిగారని కొందరు భావిస్తున్నారు. జేసీ మాటల అంతరార్ధం సభావేదికపై ఉన్న చంద్రబాబుకు బాగానే అర్థమైందని అందుకే జేసీ పొగిడినా ముఖ్యమంత్రి ముఖంలో మాత్రం సీరియస్‌నెస్సే కనిపించిందంటున్నారు. మొత్తం మీద జగన్ వెళ్తున్న దారి సరైనది కాదన్న ఆవేదనే జేసీ మనసులో ఉందని చెప్పుకుంటున్నారు.
Click to Read: