Telugu Global
Others

టీ కాంగ్రెస్‌ వేగు చుక్కలు- తదుపరి టార్గెట్?

తెలంగాణ ఇచ్చినా సాధారణ ఎన్నికల్లో గెలుపు తీరం చేరలేకపోయింది కాంగ్రెస్. వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా కోల్పోయి కుదేలైంది. కూలిన టీ కాంగ్రెస్‌ను నిలబెట్టే వారి కోసమే ఆ పార్టీ శ్రేణులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. వారికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. అటు నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు మహబూబ్‌నగర్‌లో డీకే అరుణలు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచి గెలిచి చూపించారు. దీని బట్టి చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ […]

టీ కాంగ్రెస్‌ వేగు చుక్కలు- తదుపరి టార్గెట్?
X

తెలంగాణ ఇచ్చినా సాధారణ ఎన్నికల్లో గెలుపు తీరం చేరలేకపోయింది కాంగ్రెస్. వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా కోల్పోయి కుదేలైంది. కూలిన టీ కాంగ్రెస్‌ను నిలబెట్టే వారి కోసమే ఆ పార్టీ శ్రేణులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. వారికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది.

అటు నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు మహబూబ్‌నగర్‌లో డీకే అరుణలు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచి గెలిచి చూపించారు. దీని బట్టి చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ చచ్చిపోలేదు… నాయకత్వమే చచ్చుబడినట్టు కనిపిస్తుంది. నమ్మకం కలిగించే నాయకుడు ఉంటే కాంగ్రెస్ పుంజుకోవడం ఏమంతా కష్టం కాదనిపిస్తోంది. ప్రస్తుతం టీ కాంగ్రెస్‌కు కావాల్సింది గౌరవనీయులైన పెద్దలు, అన్నింటా ఉత్తమంగా ఉండాలనుకునే నాయకులు కాదు. అధికార పార్టీకి ధీటుగా శ్రేణులను కదనరంగంలో కదిలించే నాయకత్వం.

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం కోమటిరెడ్డి, డీకే అరుణ లాంటి వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం అసన్నమైందనిపిస్తోంది. కోమటిరెడ్డితో పాటు మహిళ అయినప్పటికీ డీకే అరుణలో కూడా అధికార పార్టీకి ధీటైన సమాధానం ఇవ్వగల శక్తిసామర్థ్యాలు కనిపిస్తున్నాయి. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల భావన ఇది.

YOU MAY ALSO LIKE

komatreddy

First Published:  30 Dec 2015 10:37 PM IST
Next Story