139 కార్లు, మహిళలకు 10 తులాల బంగారం- కోమటిరెడ్డి ఇలా గెలిచారా?
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ లంచాలు ఎరగా వేశారని వివరాలతో సహా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కార్లు, బంగారం పంపిణీ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. 139 స్విఫ్ట్ కార్లతో పాటు ఒక్కో మహిళా ఓటరుకు 10 తులాల బంగారం చొప్పున కోమటిరెడ్డి బ్రదర్స్ పంపిణీ చేశారని ఆరోపించారు. రాజేశ్వరరెడ్డి […]
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ లంచాలు ఎరగా వేశారని వివరాలతో సహా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కార్లు, బంగారం పంపిణీ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. 139 స్విఫ్ట్ కార్లతో పాటు ఒక్కో మహిళా ఓటరుకు 10 తులాల బంగారం చొప్పున కోమటిరెడ్డి బ్రదర్స్ పంపిణీ చేశారని ఆరోపించారు. రాజేశ్వరరెడ్డి మరో విషయాన్ని కూడా చెప్పారు.
మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 3 స్థానాలకు వదిలేసేందుకు తాము అంగీకరించినా కాంగ్రెస్ ముందుకు రాలేదని బెడిసికొట్టిన సీక్రెట్ ఒప్పంద వివరాలను ఇప్పుడు బయటపెట్టారు. అయినా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఒక్క కోమటిరెడ్డి బద్రర్సే కాకుండా ప్రతి నాయకుడు తన శక్తిమేర డబ్బులు వెదజల్లుతూనే ఉన్నారు. ఈ పద్దతి మారాలి.
YOU MAY ALSO LIKE