Telugu Global
Cinema & Entertainment

మ్యూజిక‌ల్  హిట్ ఖాయంగా క‌నిపిస్తుంది

టు బీ ఫ్రాంక్. ప్ర‌స్తుతం  వున్న  నాగార్జున ఏజ్ కు ఏ సినిమా చేసినా చూసే ప‌రిస్థితి లేదు. క‌థ‌లో కాస్తా విష‌యం ఉండాలి.  ఆయ‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్లు ఆయ‌న పాత్ర  ఉండాలి.  ఏదో మాయ మంత్రం మ్యాజిక్ లు చేద్దామంటే  నో వే. ఆ విష‌యం నాగార్జునకు తెలుసు. అందుకే త‌ను చేస్తున్న  సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం విష‌యంలో  చాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో ద‌ర్శ‌కుడు చేసిన   కొన్ని స‌న్నివేశాలు  బాగా రాక […]

మ్యూజిక‌ల్  హిట్ ఖాయంగా క‌నిపిస్తుంది
X

టు బీ ఫ్రాంక్. ప్ర‌స్తుతం వున్న నాగార్జున ఏజ్ కు ఏ సినిమా చేసినా చూసే ప‌రిస్థితి లేదు. క‌థ‌లో కాస్తా విష‌యం ఉండాలి. ఆయ‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్లు ఆయ‌న పాత్ర ఉండాలి. ఏదో మాయ మంత్రం మ్యాజిక్ లు చేద్దామంటే నో వే. ఆ విష‌యం నాగార్జునకు తెలుసు. అందుకే త‌ను చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం విష‌యంలో చాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో ద‌ర్శ‌కుడు చేసిన కొన్ని స‌న్నివేశాలు బాగా రాక పోతే రీ షూట్ కూడా చేయించారు. దానికి త‌గ్గ‌ట్లు ముగ్గురు హీరోయిన్స్ ను పెట్టారు. ఒక‌రు హాలో బ్ర‌ద‌ర్ లో నాగ్ స‌ర‌స‌న ఆడి పాడిన సీనియ‌ర్ న‌టీ ర‌మ్య కృష్ణ , లావ‌ణ్య త్రిపాఠి.. యాంక‌ర్ అన‌సూయ కూడా చేరింది.

ర‌మ్య‌కృష్ణ చాలా గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా ఆడియో రిలీజ్ మొన్న‌నే హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. అక్కినేని వారి కుటుంబం అంతా అటెండ్ అయ్యింది. గ్రామీణ నేప‌థ్యంగా సినిమాను చేసిన‌ట్లు తెలుస్తుంది. దీనికి మించి సాంగ్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుని మంచి ఫోక్ బీట్ సాంగ్స్ కొట్టించారు. ప్ర‌తి పాట చూస్తూ ఆనందించేలా పిక్చ‌రైజ్ చేశారనిపిస్తుంది. అన‌సూయ కూడా నాగ్ కి మ‌ర‌ద‌లు క్యారెక్ట‌ర్ లో అల‌రించ‌నుంది. మొత్తం మీద సొగ్గాడు చిన్ని నాయ‌న రూపంలో బాలయ్య డిక్టేట‌ర్ సినిమాకు సంక్రాంతి బ‌రిలో గ‌ట్టి పోటీ ఉందనే చెప్పాలి.

First Published:  31 Dec 2015 12:43 AM IST
Next Story