Telugu Global
Others

ఒక్కో జిల్లాలో ఒక్కోలా 'గంటా'నాదం

గంటా శ్రీనివాస్‌రావు. తెలివైన రాజకీయ నాయకుడు. అధికారంలోకి వచ్చే పార్టీలోకి ఈయన వెళ్తారో లేక ఈయన పాదం మోపిన పార్టీయే అధికారంలోకి వస్తుందో తెలియదు గానీ కొన్నేళ్లుగా రాజకీయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన గంటా… ఎన్నికల ముందు టీడీపీలో చేరి తనకున్న ప్రత్యేకతలతో మళ్లీ మంత్రి అయ్యారు. రాజకీయంగా గంటా ఎత్తులకు అదో నిదర్శనం. ఇప్పుడు పార్టీలోకి వలసల విషయంలో గంటా శ్రీనివాస్‌ చేస్తున్న రాజకీయం టీడీపీ నేతలకే అంతుచిక్కడం లేదు. […]

ఒక్కో జిల్లాలో ఒక్కోలా గంటానాదం
X

గంటా శ్రీనివాస్‌రావు. తెలివైన రాజకీయ నాయకుడు. అధికారంలోకి వచ్చే పార్టీలోకి ఈయన వెళ్తారో లేక ఈయన పాదం మోపిన పార్టీయే అధికారంలోకి వస్తుందో తెలియదు గానీ కొన్నేళ్లుగా రాజకీయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన గంటా… ఎన్నికల ముందు టీడీపీలో చేరి తనకున్న ప్రత్యేకతలతో మళ్లీ మంత్రి అయ్యారు. రాజకీయంగా గంటా ఎత్తులకు అదో నిదర్శనం. ఇప్పుడు పార్టీలోకి వలసల విషయంలో గంటా శ్రీనివాస్‌ చేస్తున్న రాజకీయం టీడీపీ నేతలకే అంతుచిక్కడం లేదు.

తన జిల్లాలో ఒకలా వేరే జిల్లాలో మరోలా వలసల విషయంలో ఆయన వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతం కోసమంటూ మాజీ మంత్రి కొణతాలను పార్టీలోకి తెచ్చేందుకు చంద్రబాబు, మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తుంటే గంటా మాత్రం అడ్డుపడుతూనే ఉన్నారు. కొణతాల చేరికకు వ్యతిరేకంగా జిల్లా నేతలను వెనకుండి గంటా ఎగదోస్తున్నారని చెబుతున్నారు. కొణతాల వస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని లోకల్ లీడర్లు తీర్మానాలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. దీనంతటికి మంత్రి గంటాయే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇదే గంటా శ్రీనివాస్ కడప జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

కడప జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న గంటా … జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చే విషయంలో ముందుండి చర్చలు జరుపుతున్నారు. ఆది వస్తే పార్టీ బలపడుతుందంటూ దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డితో శత్రుత్వం ఉన్న రామసుబ్బారెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తీరుపై జమ్మలమడుగు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సొంత జిల్లాలో మాత్రం వలసలు వద్దనే గంటా.. కడప జిల్లాకు వచ్చే సరికి మాత్రం పార్టీ బలోపేతమంటూ నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొణతాలతో గంటాకు మరీ తీవ్రమైన వైరం కూడా లేదని అలాంటి చోటే వలస వద్దని చెప్పే గంటా… దశాబ్దాలుగా తీవ్ర పోరుకు వేదికైన జమ్మలమడుగులో మాత్రం ఆదినారాయణరెడ్డి పార్టీలోకి తీసుకురావాలని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అదన్న మాట గంటాగారి ఒక్కో జిల్లాలో ఒక్కో రాజకీయ నినాదం.

Click to Read:

jagan-ramasubba-redy

First Published:  31 Dec 2015 11:30 AM IST
Next Story