మహేష్ హీరోయిన్ డిప్రెషన్లో పడిందా ?
మహేష్‌బాబు సినిమాతో పరిచయమయ్యే అదృష్టం ఎంత మందికి వస్తుంది చెప్పండి. సరాసరి సూపర్‌స్టార్‌తో మొదటి చిత్రం చేసినా కానీ కృతిసనన్‌కి తెలుగు చిత్ర పరిశ్రమలో దశ తిరగలేదు. 1 నేనొక్కడినే తర్వాత చేసిన దోచేయ్ కూడా డిజాస్టర్ అవడంతో కృతి ఇక బాలీవుడ్ మీదే ఆశలు పెట్టుకుంది. అక్కడ మొదటి సినిమా హీరోపంతి ఓకే అనిపించుకున్నా కానీ తన కెరియర్ని మలుపు తిప్పేది మాత్రం దిల్వాలే సినిమానే అని నమ్మింది. షారుక్, రోహిత్‌శెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమా […]
BY sarvi31 Dec 2015 12:38 AM IST
X
sarvi Updated On: 31 Dec 2015 9:15 AM IST
మహేష్‌బాబు సినిమాతో పరిచయమయ్యే అదృష్టం ఎంత మందికి వస్తుంది చెప్పండి. సరాసరి సూపర్‌స్టార్‌తో మొదటి చిత్రం చేసినా కానీ కృతిసనన్‌కి తెలుగు చిత్ర పరిశ్రమలో దశ తిరగలేదు. 1 నేనొక్కడినే తర్వాత చేసిన దోచేయ్ కూడా డిజాస్టర్ అవడంతో కృతి ఇక బాలీవుడ్ మీదే ఆశలు పెట్టుకుంది. అక్కడ మొదటి సినిమా హీరోపంతి ఓకే అనిపించుకున్నా కానీ తన కెరియర్ని మలుపు తిప్పేది మాత్రం దిల్వాలే సినిమానే అని నమ్మింది.
షారుక్, రోహిత్‌శెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమా కనుక దానిపై అన్ని ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ రోహిత్ శెట్టి మొదటిసారి తన ఫార్ములాని సక్సెస్‌ఫుల్‌గా మలచలేకపోవడంతో దిల్వాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇది కానీ హిట్ అయితే ఇక సూపర్‌స్టార్స్ సినిమాల్లో వరసగా ఆఫర్లు వచ్చేస్తాయని చూసిన కృతి దిల్వాలే దెబ్బ నుంచి కోలుకోలేకపోతోంది. ఈ చిత్రం వల్ల మిగతా ఎవరికీ పెద్ద నష్టమేం లేదు. షారుక్‌కి, వరుణ్ ధావన్‌కి కావాల్సినన్ని సినిమాలున్నాయి. తన కెరియర్‌కి డిఫైనింగ్ సినిమా అవుతుందని అనుకున్న దిల్వాలే ఇలా తన కెరియర్ని గందరగోళంలో పడేయడంతో పాపం పిల్ల డిప్రెషన్లో పడింది.
Next Story