కరిబియన్ ఆఫ్ ది పైరెట్స్ హీరోకు వార్నింగ్
టైమ్ కలసి రాక పోతే తాడు పాము అవుతుంది అంటారు. మరి అంతా కాదు కానీ.. మన కరెబియిన్ ఆఫ్ ది పైరట్స్ హీరో జానీ డీప్ కు ఇప్పుడు ఆ అంటే గడ గడ లాడిపోతున్నాడు. ఆయన దృష్టిలో ఇప్పుడు ఆ అంటే అస్ట్రేలియా నే. కారణం..ఆయనా ..ఆయన భార్య యాంబర్ హెర్డ్ లు వచ్చే ఏప్రిల్ 18 న అక్కడ కోర్టుకు హాజరు కావాలని నోటిసులు అందడమే. ఇంతకి ఆయనకు కోర్టు నోటిసులు అందడానికి […]
టైమ్ కలసి రాక పోతే తాడు పాము అవుతుంది అంటారు. మరి అంతా కాదు కానీ.. మన కరెబియిన్ ఆఫ్ ది పైరట్స్ హీరో జానీ డీప్ కు ఇప్పుడు ఆ అంటే గడ గడ లాడిపోతున్నాడు. ఆయన దృష్టిలో ఇప్పుడు ఆ అంటే అస్ట్రేలియా నే. కారణం..ఆయనా ..ఆయన భార్య యాంబర్ హెర్డ్ లు వచ్చే ఏప్రిల్ 18 న అక్కడ కోర్టుకు హాజరు కావాలని నోటిసులు అందడమే. ఇంతకి ఆయనకు కోర్టు నోటిసులు అందడానికి రీజన్..ఆయన పెంచుకుంటున్న రెండు శునక రాజాలే కారణం. పైరేట్స్ ఆఫ్ ది కరిబియన్ సిరీస్ చిత్రాల్లో ఒకటైన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ షూటింగ్ కు ఆయన తన సొంత విమానంలో ఆస్ట్రేలియా క్వీన్ లాండ్స్ లోని గోల్డ్ కోస్ట్ ప్రాంతంలో సతీ శునక సమేతంగా దిగాడు.
అంతే అది చూసిన ఆ దేశ అధికారులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తమ దేశంలోకి అమెరికన్ కుక్కలు ఎలా అంటే అలా వచ్చేసే వీల్లేదని . వాటివల్ల తమ దేశంలోకి ఎన్నో జబ్బులు వ్యాపించే ప్రమాదం ఉంది కనుక, వాటిని ముందు క్వారైంటైన్ చెయ్యాలనేది ఆస్ట్రేలియన్ రూల్ . దీనికి వ్యతిరేకంగా వచ్చిన జానీ డెప్ తన కుక్కలను గనుక 24 గంటల్లో వెనక్కు తీసుకెళ్లక పోతే , వాటిని కాల్చి పారేస్తామని ఏకంగా ఆస్ట్రేలియన్ హోమ్ శాఖామంత్రి బార్నబీ జాయ్స్ ప్రకటించడంతో , డెప్ తన కుక్కలతో సహా తోక ముడిచాడు. అయినా ఇంకా అక్కడి కేసులు ఆయన్ని వేట కుక్కులా వేటాడుతునే ఉన్నాయి.