అర్చకులు, భవానీల మధ్య డబ్బు సంచుల గోల
విజయవాడ కనకదుర్గ ఆలయంలో మరోసారి అర్చకులు, భవానీల మధ్య వివాదం తలెత్తింది. భవానీగురుస్వాములు, అర్చకులు ఏకంగా ఘర్షణ పడ్డారు. ఒకరి బ్యాగులు మరొకరు లాగేసుకుని అందులోకి డబ్బులను బయటకు పోశారు. అర్చకులు నిబంధనలకు విరుద్దంగా భవానీల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్నది ఆరోపణ. అదే సమయంలో కొందరు గురుస్వాములు కూడా డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కొందరు అర్చకుల బ్యాగుల్లో నుంచి బీడీలు, సిగరెట్లు బయటపడ్డాయి.