ఖమ్మంలో వైసీపీ దెబ్బ? టీఆర్‌ఎస్ గెలుపు
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మినారాయణతో సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు హోరాహోరీగా పోరాడినా చివరకు గెలుపు అధికార పార్టీనే వరించింది. 31 ఓట్ల స్వల్ప మేజారిటీతో టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 316 ఓట్లు రాగా… సీపీఐ అభ్యర్థికి 275 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ వైసీపీకి 102 ఓట్లు వచ్చాయి. విపక్షాలన్నీ ఒక్కటై ఉంటే ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి […]
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మినారాయణతో సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు హోరాహోరీగా పోరాడినా చివరకు గెలుపు అధికార పార్టీనే వరించింది. 31 ఓట్ల స్వల్ప మేజారిటీతో టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 316 ఓట్లు రాగా… సీపీఐ అభ్యర్థికి 275 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ వైసీపీకి 102 ఓట్లు వచ్చాయి. విపక్షాలన్నీ ఒక్కటై ఉంటే ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయేవారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఒక వేళ వైసీపీ బరిలో దిగి ఉండకపోతే ఆ పార్టీ ఓట్లను అధికార పార్టీయే ఆకర్శించేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.