రాజ్‌నాథ్‌కు నాగం గూఢాచారి?
ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగం జనార్దన్‌రెడ్డి. ఆ తర్వాత రానురాను ఆయన ప్రభ పార్టీలో తగ్గుతూ వచ్చింది. చివరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో బచావో తెలంగాణ మిషన్ అంటూ కొన్ని నెలల క్రితం సొంత కుంపటిని పెట్టారు. అయితే తిరిగి ఈ మధ్య నాగం జనార్దన్‌రెడ్డికి బీజేపీలో విపరీతమైన మర్యాద లభిస్తోందని చెబుతున్నారు. ఇందుకు కారణం నాగం జనార్దన్‌రెడ్డి గురించి రాష్ట్ర నాయకులకు అసలు సంగతి తెలియడమేనంటున్నారు పార్టీ […]
ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగం జనార్దన్‌రెడ్డి. ఆ తర్వాత రానురాను ఆయన ప్రభ పార్టీలో తగ్గుతూ వచ్చింది. చివరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో బచావో తెలంగాణ మిషన్ అంటూ కొన్ని నెలల క్రితం సొంత కుంపటిని పెట్టారు. అయితే తిరిగి ఈ మధ్య నాగం జనార్దన్‌రెడ్డికి బీజేపీలో విపరీతమైన మర్యాద లభిస్తోందని చెబుతున్నారు. ఇందుకు కారణం నాగం జనార్దన్‌రెడ్డి గురించి రాష్ట్ర నాయకులకు అసలు సంగతి తెలియడమేనంటున్నారు పార్టీ నేతలు.
నాగం జనార్దన్ రెడ్డి పైకి సైలెంట్‌గా ఉంటున్నా లోలోన తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారట. ఆ దారిలో రాజ్‌నాథ్‌కు నాగం చాలా దగ్గరయ్యారని చెబుతున్నారు. ఇటీవల నాగంను ఢిల్లీ పిలిపించుకున్న రాజ్‌నాథ్ సింగ్ భవిష్యత్తుపై ఆయనకు గట్టి హామీ కూడా ఇచ్చారంటున్నారు. త్వరలోనే నాగం జనార్దన్‌రెడ్డికి ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కేలా చేస్తామని కూడా కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర పెద్దలతో నాగం నడుపుతున్న రహస్య సంబంధాలు ఇటీవల వరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా తెలియదట. అందుకే కొద్ది రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి బృందం నాగం జనార్దన్‌రెడ్డిని పట్టుబట్టి తీసుకెళ్లారని చెబుతున్నారు. మిగిలిన బీజేపీ నేతలు కూడా నాగం దగ్గర ఇప్పుడు జాగ్రత్తగా మసలుతున్నారట. అదీ నాగం వేసిన ఎత్తుకు పార్టీ నేతల్లో కలిగిన మార్పు.