హిందూమతాన్ని కించపరుస్తూ టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు!
పశ్చిమగోదావరి జిల్లా ఎలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు హిందూమతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. హిందూమతంలో ఆధ్యాత్మికత ఉండదని ఎంపీ చెప్పారని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. కొయ్యలగూడెంలో జరిగిన క్రిస్‌మస్ వేడుకలకు హాజరైన ఎంపీ మాగంటి… హిందూమతంలో గంటల చప్పుడు, ప్రసాదాల కోసం తోపులాటలు తప్ప ఏమీ ఉండవని వ్యాఖ్యానించారట. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమపథకాలు టీడీపీ వారికే దక్కాలి తప్ప… ఇతరులకు, వైసీపీ అభిమానులకు అందకూడదని ఎంపీ అన్నట్టు సదరు మీడియా సంస్థ చెబుతోంది. ఎంపీ చేసిన […]

పశ్చిమగోదావరి జిల్లా ఎలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు హిందూమతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. హిందూమతంలో ఆధ్యాత్మికత ఉండదని ఎంపీ చెప్పారని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. కొయ్యలగూడెంలో జరిగిన క్రిస్‌మస్ వేడుకలకు హాజరైన ఎంపీ మాగంటి… హిందూమతంలో గంటల చప్పుడు, ప్రసాదాల కోసం తోపులాటలు తప్ప ఏమీ ఉండవని వ్యాఖ్యానించారట. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమపథకాలు టీడీపీ వారికే దక్కాలి తప్ప… ఇతరులకు, వైసీపీ అభిమానులకు అందకూడదని ఎంపీ అన్నట్టు సదరు మీడియా సంస్థ చెబుతోంది. ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు మీడియా సంస్థ చెప్పినట్టు నిజంగా ఎంపీ మాగంటి బాబు హిందూమతాన్ని కించపరచడంతో పాటు, సంక్షేమ పథకాలు టీడీపీ వారికే అందాలనడం నిజంగా దురదృష్ణకరం.