Telugu Global
Others

కడపలో చిన్న లాజిక్ మిస్సయిన చినబాబు!

కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేస్తే జగన్‌ బలహీనపడిపోతారన్నది టీడీపీ ఎత్తుగడ. ఇంకా చెప్పాలంటే ఈ ఎత్తువేసింది చినబాబు లోకేష్. అందులో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వలవేశారు. ఆయన కూడా టీడీపీ వలకు చిక్కారు. త్వరలోనే టీడీపీలోకి చేరిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఆదివారం జగన్‌ జమ్మలమడుగు పర్యటనలో కూడా ఆదినారాయణరెడ్డి పాల్గొనలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలకు అసలు సంగతి అర్థమైంది. ఆదినారాయణరెడ్డి పార్టీలోకి రావడాన్ని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నా లోకేష్ […]

కడపలో చిన్న లాజిక్ మిస్సయిన చినబాబు!
X

కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేస్తే జగన్‌ బలహీనపడిపోతారన్నది టీడీపీ ఎత్తుగడ. ఇంకా చెప్పాలంటే ఈ ఎత్తువేసింది చినబాబు లోకేష్. అందులో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వలవేశారు. ఆయన కూడా టీడీపీ వలకు చిక్కారు. త్వరలోనే టీడీపీలోకి చేరిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఆదివారం జగన్‌ జమ్మలమడుగు పర్యటనలో కూడా ఆదినారాయణరెడ్డి పాల్గొనలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలకు అసలు సంగతి అర్థమైంది.

ఆదినారాయణరెడ్డి పార్టీలోకి రావడాన్ని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నా లోకేష్ అండ్ టీం లెక్కచేయలేదు. రామసుబ్బారెడ్డి ఎక్కడికి పోతారులే !.. అన్న ధీమాతో ఇలా చేశారని చెప్పుకుంటున్నారు. అయితే జమ్మలమడుగు పర్యటనలో జగన్‌ను రామసుబ్బారెడ్డి దగ్గర బంధువులు కలవడంతో టీడీపీలో కలకలం రేగింది. పైగా ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమని జగన్‌తో వారు చెప్పారు. దీంతో ఎక్కడో లెక్క తప్పిందన్న అంచనాకు టీడీపీ నేతలు వచ్చారు.

Click to Read: సెక్స్‌రాకెట్ దుర్మార్గులను చంపేస్తాం

ఆదినారాయణ టీడీపీలోకి వచ్చి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న దానిపై లెక్కలేస్తున్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తెచ్చి ఆయనతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే టీడీపీకి కష్టాలు తప్పవంటున్నారు. ఎందుకంటే రామసుబ్బారెడ్డి వరుసగా ఓడిపోతున్నారు. కాబట్టి ఆయనపై ఇప్పటికే నియోజకవర్గంలో సానుభూతి ఉంది. పైగా జమ్మలమడుగులో టీడీపీ బలహీనంగా ఉంది. కాబట్టి వైసీపీ తరపున రామసుబ్బారెడ్డి బరిలో దిగితే సానుభూతి, వైసీపీ ఓటు బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేకత ఇలా అన్నీ తోడై టీడీపీ కొంపముంచడం ఖాయమని భావిస్తున్నారు. ఇంత చిన్న లాజిక్‌ను లోకేష్ ఎలా మిస్పయ్యారో అర్థం కావడం లేదంటున్నారు జిల్లా టీడీపీ నేతలు.

First Published:  28 Dec 2015 10:34 PM IST
Next Story