రాజకీయ సన్యాసం తీసుకోలేదు
ఉమ్మడి రాష్ట్రం ఆఖరి రోజుల్లో చక్రం తిప్పిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ తర్వాత పార్టీ పెట్టి అది కాస్త వర్కవుట్ కాకపోవడంతో రాజకీయ చక్రం కిందపడేసి బెంగళూర్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ చల్లనిప్రదేశంలోనే సేదతీరుతున్నారు. ఏదో పుస్తకాల ఆవిష్కరణ , పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల్లో తప్పితే ఆయన ఎక్కడా కనిపించడం లేదు. సోమవారం రాజమండ్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆ సమయంలో కొందరు నేతలు ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఆ […]
ఉమ్మడి రాష్ట్రం ఆఖరి రోజుల్లో చక్రం తిప్పిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ తర్వాత పార్టీ పెట్టి అది కాస్త వర్కవుట్ కాకపోవడంతో రాజకీయ చక్రం కిందపడేసి బెంగళూర్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ చల్లనిప్రదేశంలోనే సేదతీరుతున్నారు. ఏదో పుస్తకాల ఆవిష్కరణ , పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల్లో తప్పితే ఆయన ఎక్కడా కనిపించడం లేదు. సోమవారం రాజమండ్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆ సమయంలో కొందరు నేతలు ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలో రాజకీయ భవిష్యత్తుపై కిరణ్ చిన్న క్లూ ఇచ్చారట.
తనలాగే ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న కొందరు నేతలు ఏం చేద్దామని కిరణ్‌ను అడిగారట. అందుకు సింపుల్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ”చూద్దాం ఇంకా టైమ్ ఉంది కదా… తొందరెందుకు” అని వ్యాఖ్యానించారట. ఈ ఒక్క వ్యాఖ్యను బట్టి చూస్తే కిరణ్ రాజకీయ సన్యాసం తీసుకోలేదనిపిస్తోంది. రాజకీయ తెరపై మళ్లీ మెరిసేందుకు టైమ్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా అర్థమవుతోంది. పైగా ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మౌనంగా వెళ్లిపోలేదు కిరణ్. రాష్ట్రంలోని పరిస్థితులపై మాట్లాడారు. అమరావతి రహస్యాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాలపైనా స్పందించారు. తాను అప్పట్లో చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడిన ధోరణి, సన్నిహిత నేతలతో చెప్పిన విషయాలు గమనిస్తే కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్ రోల్ పోషించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండడంతో ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నట్టుగా భావిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి కిరణ్ రంగంలోకి దిగే అవకాశం ఉందని కొందరు సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు.