మహేష్ హీరోయిన్ కు షాకిచ్చిన ప్రయాణికుడు
మహేష్ బాబు సరసన వన్-నేనొక్కడినే సినిమా చేసింది కృతి సనన్. తర్వాత ఏకంగా బాలీవుడ్ లో షారూక్ తో కలిసి దిల్ వాలే మూవీలో నటించింది. సరే… ఆమె సినిమాల సంగతి అటుంచితే…. ఆమెకు షాకిచ్చిన సంఘటన ఒకటి తాజాగా జరిగింది. దిల్ వాలే సినిమా విడుదలవ్వడం దానికి పైరసీ వచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అందులో నటించిన కృతి సనన్ పక్కనుందనే విషయం తెలిసి కూడా ఓ ప్రయాణికుడు…. ఎంచక్కా దిల్ వాలే పైరసీ […]
BY sarvi29 Dec 2015 12:34 AM IST

X
sarvi Updated On: 29 Dec 2015 7:13 AM IST
మహేష్ బాబు సరసన వన్-నేనొక్కడినే సినిమా చేసింది కృతి సనన్. తర్వాత ఏకంగా బాలీవుడ్ లో షారూక్ తో కలిసి దిల్ వాలే మూవీలో నటించింది. సరే… ఆమె సినిమాల సంగతి అటుంచితే…. ఆమెకు షాకిచ్చిన సంఘటన ఒకటి తాజాగా జరిగింది. దిల్ వాలే సినిమా విడుదలవ్వడం దానికి పైరసీ వచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అందులో నటించిన కృతి సనన్ పక్కనుందనే విషయం తెలిసి కూడా ఓ ప్రయాణికుడు…. ఎంచక్కా దిల్ వాలే పైరసీ సినిమాను ఎంజాయ్ చేశాడు. కృతి సనన్ వద్దని చెబుతున్నప్పటికీ… ఆ పాసింజర్ కేర్ చేయకుండా సినిమాను ఎంజాయ్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు హీరోయిన్ ట్వీట్ చేసింది. తను వద్దని చెబుతున్నా…తన పక్కనే ఉన్న ప్రయాణికుడు ఎంచక్కా దిల్ వాలే సినిమా పైరసీ ప్రింట్ ను ఎంజాయ్ చేశాడని రాసుకొచ్చింది. దయచేసి సినిమాల్ని థియేటర్లలోనే చూడాలని…. పైరసీని ప్రోత్సహించవద్దని మరోసారి రొటీన్ గా చెప్పుకొచ్చింది కృతి సనన్.
Next Story