కథలో వేలు పెడుతున్న బన్నీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఏరికోరి కథ చెబితే.. ‘ఫలానా మార్పులు చేస్తేనే మీతో సినిమా’ అనే హీరోలు కొందరు తెలుగులో ఉన్నారు. ఇలాంటి జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ఇష్క్, మనం వంటి వైవిధ్యమైన కథలతో విజయాలు సాధించిన దర్శకుడు విక్రమ్ కుమార్. ఇటీవల విక్రమ్ బన్నీని కలిసి కథ చెప్పాడట. మొత్తం విన్న బన్నీ కొన్ని మార్పులు సూచించాడట. ఆ మేరకు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని స్పష్టం చేశాడట. పైగా విక్రమ్ తాజా […]
BY sarvi29 Dec 2015 12:32 AM IST
X
sarvi Updated On: 29 Dec 2015 5:28 AM IST
వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఏరికోరి కథ చెబితే.. ‘ఫలానా మార్పులు చేస్తేనే మీతో సినిమా’ అనే హీరోలు కొందరు తెలుగులో ఉన్నారు. ఇలాంటి జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ఇష్క్, మనం వంటి వైవిధ్యమైన కథలతో విజయాలు సాధించిన దర్శకుడు విక్రమ్ కుమార్. ఇటీవల విక్రమ్ బన్నీని కలిసి కథ చెప్పాడట. మొత్తం విన్న బన్నీ కొన్ని మార్పులు సూచించాడట. ఆ మేరకు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని స్పష్టం చేశాడట. పైగా విక్రమ్ తాజా సినిమా ‘మేము’ (హీరో సూర్య) సినిమా తరువాతే ఈ సినిమా ఉంటుందని కూడా కండిషన్ పెట్టాడట.
తండ్రి బాటలోనే..!
మెగాకాంపౌండ్ హీరోల కోసం దర్శకులు తెచ్చే కథల్లో వేలు పెడతాడని అల్లు అరవింద్‌కు ఓ పేరు ఉంది. అతని తరువాత పవన్ కల్యాణ్ కూడా దర్శకుల పనిలో అడ్డుపుల్ల వేస్తాడని తరచుగా వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో బన్నీ కూడా చేరిపోయాడు. ఏకంగా తండ్రినే మించిపోయాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ’13బీ, ఇష్క్, మనం’లాంటి విభిన్నమైన, వైవిధ్యమైన సినిమాలను విజయాలుగా మలిచిన, సత్తాగలిగిన డైరెక్టర్ విక్రమ్. ‘మేము’ సినిమా విడుదల తరువాత ఈ ప్రాజెక్టు చేద్దాం అని చెప్పడంతో బన్నీ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు సినీజనాలు. ఒకవేళ మేము సినిమా ఆడకపోతే… విక్రమ్ ఇంకోసారి బన్నీని కలవాల్సిన అవసరం లేదన్నమాట!
Next Story