Telugu Global
Others

సోనియా సంగతులపైనే వ్యాసం రాసిన సొంత పత్రిక

రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకునే కాలం కాదిది. కానీ సొంత మనుషులే దుమ్మెత్తిపోస్తే మాత్రం రచ్చ రేగడం ఖాయం. ఇప్పుడు కాంగ్రెస్‌ సొంత పత్రిక ”కాంగ్రెస్‌ దర్శన్” గాంధీ కుటుంబంపై విరుచుకుపడింది. అది కూడా కాంగ్రెస్ ఆవిర్భావం నాడే సొంతమనుషులపై ఇంకు చల్లించింది. నెహ్రు విధానాలను తప్పుపట్టడంతో ఆగకుండా సోనియా కుటుంబసభ్యులనూ లాగింది. సోనియా తండ్రి ఒక ఫాసిస్ట్ సైనికుడంటూ ప్రచురించింది. దీంతో సోనియాతో పాటు కాంగ్రెస్ నేతలూ బిత్తరపోయారు. సోనియా తండ్రి మైనో… […]

సోనియా సంగతులపైనే వ్యాసం రాసిన సొంత పత్రిక
X

రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకునే కాలం కాదిది. కానీ సొంత మనుషులే దుమ్మెత్తిపోస్తే మాత్రం రచ్చ రేగడం ఖాయం. ఇప్పుడు కాంగ్రెస్‌ సొంత పత్రిక ”కాంగ్రెస్‌ దర్శన్” గాంధీ కుటుంబంపై విరుచుకుపడింది. అది కూడా కాంగ్రెస్ ఆవిర్భావం నాడే సొంతమనుషులపై ఇంకు చల్లించింది. నెహ్రు విధానాలను తప్పుపట్టడంతో ఆగకుండా సోనియా కుటుంబసభ్యులనూ లాగింది.

సోనియా తండ్రి ఒక ఫాసిస్ట్ సైనికుడంటూ ప్రచురించింది. దీంతో సోనియాతో పాటు కాంగ్రెస్ నేతలూ బిత్తరపోయారు. సోనియా తండ్రి మైనో… ఇటాలియన్ ఫాసిస్ట్ సైన్యంలో సభ్యుడని రష్యా చేతితో ఆ సైన్యం ఓడిపోయిందని వివరించింది. సోనియా వ్యక్తిగత జీవితంపైనా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది పత్రిక. సోనియా ఒకప్పుడు ఎయిర్‌హోస్టెస్‌ కావాలనుకున్నారని వెల్లడించింది. 1997లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సోనియా 62 రోజులకే అధ్యక్షురాలైపోయారని గుర్తు చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం సోనియా విఫలమయ్యారని కాంగ్రెస్ దర్శన్‌ విమర్శించింది. అయితే ఈ వ్యాసాలపై ఆగ్రహించిన కాంగ్రెస్… పత్రిక కంటెంట్ ఎడిటర్‌పై వేటు వేసింది.

First Published:  28 Dec 2015 2:27 PM IST
Next Story