Telugu Global
Others

సెక్స్‌రాకెట్ దుర్మార్గులను చంపేస్తాం

బెజవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ ఒకటి రాశారు. సెక్స్‌రాకెట్ దుర్మార్గులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాల్‌మనీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నిందితులను ప్రజా కోర్టులో హతమారుస్తామని ప్రకటించారు. కాల్‌మనీ పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. కాల్‌మనీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అంగన్‌వాడీల […]

సెక్స్‌రాకెట్ దుర్మార్గులను చంపేస్తాం
X

బెజవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ ఒకటి రాశారు. సెక్స్‌రాకెట్ దుర్మార్గులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాల్‌మనీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నిందితులను ప్రజా కోర్టులో హతమారుస్తామని ప్రకటించారు. కాల్‌మనీ పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. కాల్‌మనీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అంగన్‌వాడీల తొలగింపు అంశాన్ని తెరపైకి తెచ్చారని మావోయిస్టులు విమర్శించారు.

First Published:  28 Dec 2015 9:53 AM IST
Next Story