కాల్‌మనీ కొత్త కోణం- వెలుగులోకి గ్యాంగ్ రేప్, కాల్‌డేటా
రాష్ట్రాన్ని కుదిపేసిన విజయవాడ కాల్‌మనీ – సెక్స్ రాకెట్‌లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. కాల్‌మనీపై ఫిర్యాదు చేసిన మహిళ …న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఏడుగురు నిందితులు అత్యాచారం చేశారంటూ ఆమె వాంగ్మూలం ఇచ్చారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అనంతరం తనను చెరబట్టారని వెల్లడించారు. దీంతో ఏడుగురు నిందితులపై పోలీసులు గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. click to read: సెక్స్‌రాకెట్ దుర్మార్గులను చంపేస్తాం…. పరారీలో ఉన్న […]
రాష్ట్రాన్ని కుదిపేసిన విజయవాడ కాల్‌మనీ – సెక్స్ రాకెట్‌లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. కాల్‌మనీపై ఫిర్యాదు చేసిన మహిళ …న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఏడుగురు నిందితులు అత్యాచారం చేశారంటూ ఆమె వాంగ్మూలం ఇచ్చారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అనంతరం తనను చెరబట్టారని వెల్లడించారు. దీంతో ఏడుగురు నిందితులపై పోలీసులు గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. click to read: సెక్స్‌రాకెట్ దుర్మార్గులను చంపేస్తాం….
పరారీలో ఉన్న నలుగురు నిందితులకు ఆశ్రయం కల్పించిన సోనీ కంపెనీ ఉన్నతాధికారి మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారని విచారణలో మహేష్ చెప్పాడు. దీంతో నిందితులు కోర్టులో లొంగిపోవడానికి ముందే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టు వద్ద మఫ్టీలో మోహరించారు. నిందితుల కాల్‌డేటాను పరిశీలించగా అందులో కీలక విషయాలు వెలుగు చూశాయి. కాల్‌మనీ నిందితులు పలువురు మహిళలతో గంటల తరబడి నిత్యం ఫోన్ సంభాషణలు జరిపినట్టు గుర్తించారు. భారీగా మహిళల ఫోన్‌నెంబర్లను గుర్తించారు.