Telugu Global
Others

మోసపోయిన రేవంత్‌

యుద్ధంలో సమిదలయ్యేది సైనికులే అంటుంటారు. రేవంత్ విషయంలోనూ అదే అనిపిస్తోంది. పార్టీ కోసం, చంద్రబాబు కోసం కర్ణుడిలా పోరాటం చేసిన రేవంత్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. టీఆర్‌ఎస్‌పై తాను ఒకవైపు ఆగకుండా అస్త్రాలు సంధిస్తుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం కేసీఆర్‌తో కలిసిపోవడం రేవంత్‌కు మింగుడుపడని అంశమే. తనతో పాటు కేసీఆర్‌పై వ్యతిరేక ప్రచారపోరాటం చేసిన ఒక మీడియా సంస్థ అధినేత కూడా యాగఫలం కోసం ఎర్రవెల్లి వెళ్లడం రేవంత్‌కు షాకే. ఏదో పుణ్యకార్యం కాబట్టి వెళ్లి […]

మోసపోయిన రేవంత్‌
X

యుద్ధంలో సమిదలయ్యేది సైనికులే అంటుంటారు. రేవంత్ విషయంలోనూ అదే అనిపిస్తోంది. పార్టీ కోసం, చంద్రబాబు కోసం కర్ణుడిలా పోరాటం చేసిన రేవంత్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. టీఆర్‌ఎస్‌పై తాను ఒకవైపు ఆగకుండా అస్త్రాలు సంధిస్తుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం కేసీఆర్‌తో కలిసిపోవడం రేవంత్‌కు మింగుడుపడని అంశమే. తనతో పాటు కేసీఆర్‌పై వ్యతిరేక ప్రచారపోరాటం చేసిన ఒక మీడియా సంస్థ అధినేత కూడా యాగఫలం కోసం ఎర్రవెల్లి వెళ్లడం రేవంత్‌కు షాకే. ఏదో పుణ్యకార్యం కాబట్టి వెళ్లి ఉండవచ్చుఅనుకునేందుకు లేదు. పెద్దోళ్లు ఎప్పుడూ ఇలా వేదికను చూసుకునే ప్రత్యర్థులతో కలిసిపోతుంటారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోకుండా రేవంత్‌ రెడ్డి ఆత్మబలంతో నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రులు ఒకరి ఇంటికి మరొకరు వెళ్తున్నారు. కేసీఆర్‌ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న యాగానికి కూడా చంద్రబాబు హాజరవుతున్నారు. సో … బాబు, కేసీఆర్ మధ్య బంధం కాసింత బలపడినట్టే. ఇక తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే పని అన్నట్టుగా వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఎర్రవెల్లి యాగశాలలో ప్రత్యక్షమయ్యారు.

వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితం చూసిన తర్వాత కేసీఆర్‌తో ఇప్పట్లో గొడవ పెట్టుకోకపోవడమే బెటర్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి వైఖరి మారినట్టుగా ఉంది. ఇక రామోజీరావు తొలినుంచి కూడా కేసీఆర్‌తో పెద్దగా వైరం పెంచుకోలేదు. పైగా ఓంసిటీకి 502 ఎకరాలు అప్పగింతకు కేసీఆర్‌ అంగీకరించారు. కాబట్టి రామోజీ కూడా కేసీఆర్‌కు మిత్రుడే. టీటీడీపీ నేతలు కూడా పరిస్థితిని గమనించి కేసీఆర్‌ను తిట్టడం తెలివిగా చాలా కాలం క్రితమే మానేశారు. కాబట్టి ఎవరి కోసం, ఏ పార్టీ కోసమైతే రేవంత్ పోరాటం చేస్తున్నారో… ఆ పార్టీ అగ్రనాయకత్వమే కేసీఆర్‌తో కలిసిపోయాక ఇక రేవంత్‌ పోరాటం ఎంతవరకు ఫలిస్తుంది?.

First Published:  27 Dec 2015 4:29 AM IST
Next Story