ఈ కలలు నిజమవుతాయా?
పెట్రోల్, పచ్చగడ్డి అవసరం లేకుండానే నిత్యం బోర్డర్‌లో భగ్గుమనే భారత్, పాకిస్తాన్ కలిసిపోతాయట. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా సింగిల్‌గా ఉండలేక కలిసిపోతుందట. వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్నా ఈ మాటలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. భారత్, పాక్, బంగ్లా దేశాలు కలిసిపోతాయని చెప్పారు. కాలక్రమంలో ఏదో ఒక రోజు ఇది నిజమవుతుందని చెప్పారు. అల్ జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు దేశాలు కలిసిపోయి అఖండ భారతావని ఏర్పడుతుందన్నారు. అలానీ యుద్ధాలు […]
పెట్రోల్, పచ్చగడ్డి అవసరం లేకుండానే నిత్యం బోర్డర్‌లో భగ్గుమనే భారత్, పాకిస్తాన్ కలిసిపోతాయట. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా సింగిల్‌గా ఉండలేక కలిసిపోతుందట. వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్నా ఈ మాటలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. భారత్, పాక్, బంగ్లా దేశాలు కలిసిపోతాయని చెప్పారు. కాలక్రమంలో ఏదో ఒక రోజు ఇది నిజమవుతుందని చెప్పారు. అల్ జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు దేశాలు కలిసిపోయి అఖండ భారతావని ఏర్పడుతుందన్నారు. అలానీ యుద్ధాలు చేసి ఆక్రమించడం కాదన్నారు. పరస్పర అంగీకారంతో అది ఒకనాటికి అఖండ భారతావని ఆవిర్భవిస్తుందన్నారు.