Telugu Global
Others

ఆ బ‌రువే ప్రాణం తీసింది!

మెక్సిక‌న్లలో మితిమీరుతున్న ఒబేసిటి! ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన స్థూల‌కాయుడిగా పేరుపొందిన ఆండ్రెస్ మొరెనో శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. మెక్సికోకి చెందిన ఇత‌ని వ‌య‌ను 38 సంవ‌త్స‌రాలు. ఇంత‌కుముందు  పోలీస్‌గా ప‌నిచేశాడు. రెండునెల‌ల క్రితం అక్టోబ‌రు 28న ఆండ్రెస్‌కి శ‌రీర బ‌రువుని త‌గ్గించే ఆప‌రేష‌న్ జ‌రిగింది. నాలుగింటా మూడువంతుల పొట్ట‌ని త‌గ్గించి, త‌రువాత అత‌ను త‌క్కువ ఆహారం తీసుకునే ఏర్పాటుతో ఆప‌రేష‌న్ చేశారు. ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్టుగానే వైద్యులు భావించారు. అయితే ఆప‌రేష‌న్ అనంత‌రం ఆండ్రెస్‌ పొత్తిక‌డుపులో వాపుని క‌లిగించే వ్యాధికి […]

ఆ బ‌రువే ప్రాణం తీసింది!
X

మెక్సిక‌న్లలో మితిమీరుతున్న ఒబేసిటి!

Obesity1ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన స్థూల‌కాయుడిగా పేరుపొందిన ఆండ్రెస్ మొరెనో శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. మెక్సికోకి చెందిన ఇత‌ని వ‌య‌ను 38 సంవ‌త్స‌రాలు. ఇంత‌కుముందు పోలీస్‌గా ప‌నిచేశాడు. రెండునెల‌ల క్రితం అక్టోబ‌రు 28న ఆండ్రెస్‌కి శ‌రీర బ‌రువుని త‌గ్గించే ఆప‌రేష‌న్ జ‌రిగింది. నాలుగింటా మూడువంతుల పొట్ట‌ని త‌గ్గించి, త‌రువాత అత‌ను త‌క్కువ ఆహారం తీసుకునే ఏర్పాటుతో ఆప‌రేష‌న్ చేశారు. ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్టుగానే వైద్యులు భావించారు. అయితే ఆప‌రేష‌న్ అనంత‌రం ఆండ్రెస్‌ పొత్తిక‌డుపులో వాపుని క‌లిగించే వ్యాధికి గుర‌య్యా డు. ఆ వ్యాధికి వైద్యులు అత్య‌వ‌స‌రంగా ఆప‌రేష‌న్ చేసినా కోలుకోలేక గుండెపోటుతో మ‌ర‌ణించాడు. క్రిస్‌మ‌స్ రోజు ఉద‌యం ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని ఆండ్రెస్ చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది స‌హాయంతో అత‌డిని హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ మార్గ‌మ‌ధ్యంలోనే ఆండ్రెస్ ప్రాణాలు కోల్పోయాడు.

450 కిలోల బ‌రువున్న ఆండ్రెస్‌కి బ‌రువు త‌గ్గించుకోవాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. వెయిట్ త‌గ్గించుకుని సాధార‌ణ జీవితం గ‌డ‌పాల‌ని ఆశించాడు.

ఆండ్రెస్‌ స‌ర్జ‌రీ చేయించుకున్నాక ఫోర్చుగీస్ ఫుట్‌బా ల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అత‌డిని బ‌రువు త‌గ్గ‌మ‌ని ప్రోత్స‌హిస్తూ ఒక టీష‌ర్టుని పంపాడు. త‌నపై రొనాల్డో చూపించిన శ్ర‌ద్ధ‌కు ఆండ్రెస్ ఎంతో ఆనందించాడు. కానీ సాధార‌ణ జీవితం గ‌డ‌పాల‌నే అత‌ని కోరిక తీర‌క‌పోవ‌డం విషాదం.

అధిక‌బ‌రువుని మోస్తున్న మెక్సికో ప్ర‌జ‌లు

Obesity2మెక్సికో ప్ర‌జ‌ ల్లో ఎక్కువ‌శాతం మంది స్థూల‌కాయ స‌మ‌స్య‌ని ఎదుర్కొంటున్నారు. 2013లో అమెరికాని వెన‌క్కునెట్టి ప్ర‌పంచంలోనే ఒబేసిటీ స‌మ‌స్య‌ని ఎదుర్కొంటున్న దేశాల్లో మొద‌టిదిగా మెక్సికో రికార్డుల్లో కెక్కింది. ఇప్ప‌టికే 71శాతం మంది ఉండాల్సిన బ‌రువుకంటే ఎక్కువ ఉండ‌గా వారిలో 33శాతం మంది ప్ర‌జ‌లు స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్నారు. ఆండ్రెస్‌కి ముందు ప్ర‌పంచంలో అత్యంత బ‌రువైన వ్య‌క్తిగా రికార్డుని సృష్టించిన‌ది సైతం మెక్సిక‌న్ వాసే. మాన్యూల్ యురైబ్ అనే ఆ వ్య‌క్తి ఐదువంద‌ల‌ కేజీల‌కు పైగా బ‌రువుండేవాడు. 48ఏళ్ల వ‌య‌సులో గ‌త ఏడాది అత‌ను మ‌ర‌ణించాడు.

ప్ర‌పంచానికి గుణ‌పాఠంగా నిలుస్తున్న మెక్సికో ఆహార శైలి గురించి-

  • పోష‌కాహార లోపం, కొవ్వుతో కూడిన ఆహారం ఈ రెండు స‌మ‌స్య‌లు వీరికి ఎక్కువ‌గా ఉన్నాయి.
  • మెక్సికో ఆహారంలో చాలావ‌ర‌కు వేపుడు ప‌దార్థాలే ఉంటాయి. వీటిలో కేల‌రీలు, కొవ్వు అత్యంత అధికం.
  • ఇక్క‌డ వెలుస్తున్న అమెరికా రెస్టారెంట్లు ఈ స‌మ‌స్య‌ని మ‌రింత‌గా పెంచుతున్నాయి.
  • యాబై శాతం మంది మెక్సిక‌న్లు పేద‌లే. వీరి ఆహారంలో పోష‌క విలువ‌లు లోపించి అధిక‌బ‌రువుకి గురిచేస్తున్నాయి.
  • బ‌రువు పెర‌గ‌డం కార‌ణంగా వ‌చ్చే డ‌యాబెటిస్ ఇక్క‌డ ఏటా పెరుగుతోంది. ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు దీనికి గుర‌వుతున్నారు.
  • పేద‌రికం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల‌న ఇక్క‌డ జ‌నాభాలో అధిక‌శాతం మంది ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోలేక‌పోతున్నారు. దీనికి బ‌దులు తాత్కాలిక శ‌క్తినిచ్చే జంక్‌ఫుడ్‌పై ఆధార‌ప‌డుతున్నారు. ఇక్క‌డ కోకా కోలాని మంచినీళ్ల‌లా తాగుతారు.
  • స్కూళ్ల‌లో జంక్‌ఫుడ్‌ని, సోడాని విచ్చ‌ల‌విడిగా అమ్ముతుంటారు. పిల్ల‌లు వీటిని చాలా ఎక్కువ‌గా తింటారు, తాగుతారు.
  • 1990ల్లో మ‌న‌లాగే గ్లోబ‌లైజేష‌న్ ప్ర‌భావంతో ఇక్క‌డి జీవ‌న విధానంలో మార్పులు వ‌చ్చాయి. పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, డీప్ ఫ్రైడ్ చికెన్‌, కుకీస్‌, చిప్స్‌, సాఫ్ట్ డ్రింక్‌లు…ఇవ‌న్నీ ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ దొర‌క‌డం మొద‌లైంది.
  • విద్య త‌క్కువ కావ‌డం వ‌ల‌న ఆరోగ్య స్పృహ అక్క‌డ త‌క్కువ‌గా ఉంది. ధ‌న‌వంతులైన మెక్సిక‌న్లు మాత్రం ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ పేద‌లు మాత్రం కోక్‌, కొవ్వుతో కూడిన ఆహారంతో తాము రోజంతా శ‌క్తిమంతంగా ప‌నిచేయ‌గ‌ల‌మ‌ని న‌మ్ముతున్నారు.
  • నిండుగా ఉన్న పొట్టే మ‌న‌సునిండుగా సంతోషాన్ని నింపుతుంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు.

మొత్తానికి అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం, ఒబేసిటీల విష‌యంలో మెక్సికో, ప్ర‌పంచానికి ఒక హెచ్చ‌రిక‌లా మిగిలింద‌ని చెప్ప‌వ‌చ్చు.

First Published:  26 Dec 2015 8:03 PM GMT
Next Story