మరోసారి యాగం చేస్తాః కేసీఆర్
ఆయుత చండీయాగం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్ మరో యాగ ప్రకటన చేశారు. తెలంగాణ వస్తే ఆయుత చండీయాగం చేస్తానని 2011లోనే మొక్కుకున్నట్టు ఆయన చెప్పారు. ఆ కల సాకారం అయినందుకే చండీయాగం నిర్వహించానన్నారు. ఇప్పుడు తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టులన్నీపూర్తి కావాలని అమ్మవారికి మరో మొక్కు పెట్టుకున్నట్టు వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలు సంతృప్తికరంగా ఉంటే ఈసారి ప్రయుత చండీయాగం నిర్వహిస్తానని ప్రకటించారు. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని ఆధర్మం నశిస్తుందని కేసీఆర్ చెప్పారు. […]

ఆయుత చండీయాగం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్ మరో యాగ ప్రకటన చేశారు. తెలంగాణ వస్తే ఆయుత చండీయాగం చేస్తానని 2011లోనే మొక్కుకున్నట్టు ఆయన చెప్పారు. ఆ కల సాకారం అయినందుకే చండీయాగం నిర్వహించానన్నారు. ఇప్పుడు తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టులన్నీపూర్తి కావాలని అమ్మవారికి మరో మొక్కు పెట్టుకున్నట్టు వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలు సంతృప్తికరంగా ఉంటే ఈసారి ప్రయుత చండీయాగం నిర్వహిస్తానని ప్రకటించారు. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని ఆధర్మం నశిస్తుందని కేసీఆర్ చెప్పారు. నా జీవితం ఎంతో సంపన్నమైనదని ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని అన్నారు.