Telugu Global
Others

రోజా ఎపిసోడ్‌పై నిఘా వర్గాలు ఏం చెప్పాయి?

అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలియజేశాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ విషయాన్ని ఒక టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు తనతో స్వయంగా చెప్పారని ఆమె వెల్లడించారు. చరిత్రలో లేని విధంగా మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేయడం, ఆ మరుసటి రోజు పోలీసులు చేత అరెస్ట్ చేయించి, సృహతప్పిపోయినా స్టేషన్‌కు తరలించడం వంటి పరిణామాలతో రోజాపై సానుభూతి వ్యక్తమవుతున్నట్టు నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక […]

రోజా ఎపిసోడ్‌పై నిఘా వర్గాలు ఏం చెప్పాయి?
X

అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలియజేశాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ విషయాన్ని ఒక టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు తనతో స్వయంగా చెప్పారని ఆమె వెల్లడించారు. చరిత్రలో లేని విధంగా మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేయడం, ఆ మరుసటి రోజు పోలీసులు చేత అరెస్ట్ చేయించి, సృహతప్పిపోయినా స్టేషన్‌కు తరలించడం వంటి పరిణామాలతో రోజాపై సానుభూతి వ్యక్తమవుతున్నట్టు నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయట.

Click to Read మా ఆయన ఏడ్చారు

అందువల్లే సస్పెన్షన్ అయిన మూడు రోజుల తర్వాత టీడీపీ మహిళ ఎమ్మెల్యేల చేత అసెంబ్లీలో ఏడిపించే వ్యూహానికి అధికార పార్టీ తెరలేపిందని రోజా అన్నారు. సభ ప్రారంభానికి ముందే టీడీపీ ముఖ్య నేతలు ఈ విషయంలో మహిళ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని ఆమె చెప్పారు. ఈ విషయాలన్నీ టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు తనతో చెప్పారని రోజా వెల్లడించారు. కాల్‌మనీ పేరుతో మహిళలను వడ్డీ వ్యాపారులు ఈడ్చుకెళ్తేంటే… అంతటి సీరియస్‌ అంశంపై అసెంబ్లీలో ఆందోళన చేయకుండా ఎలా ఉంటామని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చాలా బలహీనపడిపోయారని అందుకే మహిళా తహసీల్దార్‌ను జుట్టుపట్టి ఈడ్చికొట్టిన చింతమనేనిపై కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని రోజా అభిప్రాయపడ్డారు.

First Published:  27 Dec 2015 6:11 PM IST
Next Story