Telugu Global
Others

ఈవీఎం చోరీ నిందితుడికి రూ. 320 కోట్ల ప్రాజెక్ట్ !

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజె క్ట్‌ టెండర్ల అంశం వివాదాస్పదమవుతోంది. ఈవీఎం చోరీ కేసులో నిందితుడు, టీడీపీ ఐటీ అడ్వయిజర్‌ వేమూరి హరికృష్ణప్రసాద్‌ కంపెనీకి ఈ పనులు అప్పగించారు. వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లాడ్ సొల్యూషన్స్‌కు సోదర సంస్థ అయిన టెరా స్టాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కే రూ. 320 కోట్ల విలువైన ఈ టెండర్ దక్కింది. విచిత్రం ఏమిటంటే టెండర్ల పర్యవేక్షణ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉండడం. ఈ […]

ఈవీఎం చోరీ నిందితుడికి రూ. 320 కోట్ల ప్రాజెక్ట్ !
X

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజె క్ట్‌ టెండర్ల అంశం వివాదాస్పదమవుతోంది. ఈవీఎం చోరీ కేసులో నిందితుడు, టీడీపీ ఐటీ అడ్వయిజర్‌ వేమూరి హరికృష్ణప్రసాద్‌ కంపెనీకి ఈ పనులు అప్పగించారు. వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లాడ్ సొల్యూషన్స్‌కు సోదర సంస్థ అయిన టెరా స్టాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కే రూ. 320 కోట్ల విలువైన ఈ టెండర్ దక్కింది. విచిత్రం ఏమిటంటే టెండర్ల పర్యవేక్షణ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉండడం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెద్దల అండతో ఫైబర్ గ్రిడ్ పనులను ఏకపక్షంగా సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈవీఎంలు చోరి చేసిన హరికృష్ణప్రసాద్

2009లో వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిగా మహాకూటమి ఓటమిపాలైంది. ఈ సమయంలో ఈవీఎంల్లో అక్రమాలు జరిగాయని అందుకే తాము ఓడిపోయామని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకు బలాన్ని చేకూర్చాలన్న ఉద్దేశంతో హరికృష్ణప్రసాద్ ముంబైలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను చోరీ చేశారు. వాటిని తీసుకొచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అంటూ లైవ్‌లో డెమో ఇవ్వబోయాడు. అయితే ఈవీఎంలు ఇలా బయటకు రావడంపై షాక్‌ అయిన ఈసీ విచారణ జరపగా వాటిని వేమూరి హరికృష్ణప్రసాద్ అపహరించినట్టు తేలింది. దీంతో 2010 ఏప్రిల్‌లో హరికృష్ణప్రసాద్‌పై చోరీ కేసు నమోదైంది. పోలీసులు వేమూరి హరికృష్ణను అరెస్ట్‌ చేయడాన్ని అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈవీఎంల చోరీ నిందితుడి అరెస్ట్‌ను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.

అనంతరం వేమూరి హరికృష్ణప్రసాద్‌ను టీడీపీ ఐటీ అడ్వయిజర్‌గా నియమించారు చంద్రబాబు. టీడీపీ ఐటీ వ్యవహారాలను అప్పగించారు. అధికారంలోకి వచ్చాక ఈ- గవర్నెన్స్ అథారిటీ,ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీలో సభ్యుడిగా నియమించారు. పౌరసరఫరాల శాఖలో ప్రవేశపెట్టిన ఈ- పాస్ యంత్రాల ఏర్పాటు టెండర్‌ను కూడా ఎల్‌ 1, ఎల్‌2ను కాదని వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు కట్టబెట్టారు. కానీ యంత్రాలను సరిగా సరఫరా చేయకపోవడంతో తొలుత ఈ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. అయినా ఇప్పుడా కంపెనీ సోదర సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులు కట్టబెట్టారు.

First Published:  27 Dec 2015 3:38 AM IST
Next Story