ఈ సెటైర్లు కేసీఆర్‌పైనా?.. బాబుపైనా?
కేసీఆర్ చండీయాగంపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పట్లాగే కేసీఆర్‌ను తిట్టిపోశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాప ప్రక్షాళనకు తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా ఉందని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. చేయాల్సిన పాపాలన్నీ చేసి యాగాలు చేస్తే అవి పోతాయా అన్ని ప్రశ్నించారు. యాగాలు చేస్తూ పాపాలు చేస్తే ఫలితం దక్కుతుందా అని ప్రశ్నించారు. ఒక పక్క యాగాలు చేస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం పాపం కాదా అని రేవంత్ నిలదీశారు. పవిత్రమైన మనసుతో […]

కేసీఆర్ చండీయాగంపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పట్లాగే కేసీఆర్‌ను తిట్టిపోశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాప ప్రక్షాళనకు తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా ఉందని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. చేయాల్సిన పాపాలన్నీ చేసి యాగాలు చేస్తే అవి పోతాయా అన్ని ప్రశ్నించారు. యాగాలు చేస్తూ పాపాలు చేస్తే ఫలితం దక్కుతుందా అని ప్రశ్నించారు. ఒక పక్క యాగాలు చేస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం పాపం కాదా అని రేవంత్ నిలదీశారు. పవిత్రమైన మనసుతో దేవుడికి ఒక దండం పెట్టినా చాలని అంతకు మించి ఏమీ అవసరం లేదని అన్నారు.
నిజంగా కేసీఆర్ పాప ప్రక్షాళన కోసమే యాగం చేస్తుంటే దానికి చంద్రబాబు ఎలా హాజరవుతున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. సీఎం చంద్రబాబుతో పాటు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వెంకయ్యనాయుడు వంటి ప్రో టీడీపీ నేతలు హాజరవుతున్నప్పటికీ పాప ప్రక్షాళనకే యాగం అంటూ రేవంత్ సెటైర్లు వేయడం ఆసక్తిగా ఉంది.