ముద్దుగుమ్మపై కన్నేసిన ఉగ్ర ఐఎస్ఐఎస్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తమ హెచ్చరికలు ధిక్కరించిన మిస్ ఇరాక్ శ్యామా ఖాసింపై తుపాకీ గురిపెడుతున్నారు. తమ సంస్థలో చేరాలని లేని పక్షంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తామంటూ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. నేరుగా ఆమెకు ఫోన్ చేసి మరీ బెదిరించారు ఉగ్రవాదులు. ఇటీవల జరిగిన మిస్ ఇరాక్ పోటీల్లో తొలుత 200 మంది పాల్గొన్నారు. అయితే ఐఎస్ఐఎస్ హెచ్చరికల అనంతరం రేసులో చివరకు 10 మంది మాత్రమే మిగిలారు. వారిలో శ్యామా […]
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తమ హెచ్చరికలు ధిక్కరించిన మిస్ ఇరాక్ శ్యామా ఖాసింపై తుపాకీ గురిపెడుతున్నారు. తమ సంస్థలో చేరాలని లేని పక్షంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తామంటూ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. నేరుగా ఆమెకు ఫోన్ చేసి మరీ బెదిరించారు ఉగ్రవాదులు.
ఇటీవల జరిగిన మిస్ ఇరాక్ పోటీల్లో తొలుత 200 మంది పాల్గొన్నారు. అయితే ఐఎస్ఐఎస్ హెచ్చరికల అనంతరం రేసులో చివరకు 10 మంది మాత్రమే మిగిలారు. వారిలో శ్యామా ఖాసీం విజేతగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆమెపై ఉగ్రవాదులు కన్నేశారు. ఐఎస్ఐఎస్‌లో చేరాల్సిందేనని బెదిరిస్తున్నారు. అయితే శ్యామా ఖాసీం కూడా అంతేపట్టుదలగా ఉన్నారు. ఇరాక్ మగాళ్లకు ఉన్నవిధంగానే మహిళలకు హక్కులు ఉంటాయని చెబుతున్నారామె. ఇరాక్ మహిళల ఉనికి చాటేందుకు పోరాటం చేస్తానని ప్రకటించారు. ఐఎస్ఐఎస్‌కు లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.