ఆ హాయి... శాపమే!
తొమ్మిది గంటలకు పైగా నిద్ర, రోజంతటిలో ఎక్కువ గంటలు కూర్చునే ఉండటం, శరీరాన్ని అసలు శ్రమ పెట్టకపోవడం….ఇవన్నీ పైకి జీవితాన్ని ఎంజాయి చేయడం లాగే కనిపించినా ఈ హాయిలో ఉన్నదంతా శాపమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇలాంటి జీవన శైలి ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుంది…అనే వివరాల్లోకి వెళితే- స్లీప్, సిట్టింగ్ ఇవి రెండూ కలిసి ఆరోగ్యాన్ని ఎలా హరించివేస్తాయనే విషయం మీద నిపుణులు అధ్యయనం చేశారు. సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 2లక్షల 30వేలమంది పై […]
తొమ్మిది గంటలకు పైగా నిద్ర, రోజంతటిలో ఎక్కువ గంటలు కూర్చునే ఉండటం, శరీరాన్ని అసలు శ్రమ పెట్టకపోవడం….ఇవన్నీ పైకి జీవితాన్ని ఎంజాయి చేయడం లాగే కనిపించినా ఈ హాయిలో ఉన్నదంతా శాపమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇలాంటి జీవన శైలి ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుంది…అనే వివరాల్లోకి వెళితే-
- స్లీప్, సిట్టింగ్ ఇవి రెండూ కలిసి ఆరోగ్యాన్ని ఎలా హరించివేస్తాయనే విషయం మీద నిపుణులు అధ్యయనం చేశారు. సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 2లక్షల 30వేలమంది పై ఈ అధ్యయనాలు నిర్వహించారు.
- ఒక మనిషి రోజులో ఎక్కువ సమయం నిద్రపోవడం, అలాగే చాలా సమయాన్ని కూర్చుని గడిపేయడం ఈ రెండింటితో పాటు శారీరక వ్యాయామం సైతం లేకపోతే ఇక ఈ మూడూ కలిసి ఆ వ్యక్తి ఆరోగ్యం మీద ముప్పేట దాడి చేస్తాయట. ఇలాంటి జీవనశైలి ఉన్నవారు మిగిలినవారికంటే త్వరగా మరణించే ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉందట.
- రోజుకి ఏడుగంటల కంటే అధికంగా కూర్చుని ఉండటం, వారానికి 150 నిముషాలకంటే తక్కువగా వ్యాయామం చేయడం…ఇవి రెండూ ప్రధానంగా అనారోగ్య హేతువులు.
- ఈ బద్ధకపు జీవన శైలిని మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో సమానంగా ప్రమాదకరమైనవిగా పరిశోధకులు భావిస్తున్నారు.
- అధిక సమయం కూర్చుని ఉండటం, వ్యాయామం లేకపోవడం, మరీ తక్కువ, లేదా మరీ ఎక్కువ నిద్రలతో పాటు పొగ తాగటం, ఆల్కహాల్ అలవాటు, పోషకాహార లోపం తదితర అంశాలను సైతం అధ్యయనంలోకి తీసుకుని పరిశీలించారు.
- బద్దకపు జీవనశైలి ఉన్నవారి లాగానే, పొగతాగటం, ఆల్కహాల్, ఏడుగంటల కంటే తక్కువ నిద్ర అలవాట్లు ఉన్నవారు సైతం జీవితకాలాన్ని చేతులారా తగ్గించుకుంటున్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీరికి కూడా మిగిలినవారికంటే త్వరగా మరణించే ప్రమాదం నాలుగురెట్లు అధికంగా ఉంది.