పరిటాలపై పల్లె రెడ్డి ఫిర్యాదు
అనంతపురం జిల్లా మంత్రుల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. పరిస్థితి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లింది. పరిటాల సునీత తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి సిద్ధమయ్యారు. మంత్రుల మధ్య కొట్లాటకు క్రిస్‌మస్ చంద్రన్న కానుక కారణమైంది. పల్లె రఘునాథ్‌రెడ్డి ఐటీ శాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖను కూడా చూస్తున్నారు. పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈనేపథ్యంలో మైనార్టీలైన క్రిస్టియన్లకు ప్రభుత్వం క్రిస్‌మస్ కానుక ఇస్తోంది. […]
అనంతపురం జిల్లా మంత్రుల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. పరిస్థితి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లింది. పరిటాల సునీత తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి సిద్ధమయ్యారు. మంత్రుల మధ్య కొట్లాటకు క్రిస్‌మస్ చంద్రన్న కానుక కారణమైంది. పల్లె రఘునాథ్‌రెడ్డి ఐటీ శాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖను కూడా చూస్తున్నారు. పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈనేపథ్యంలో మైనార్టీలైన క్రిస్టియన్లకు ప్రభుత్వం క్రిస్‌మస్ కానుక ఇస్తోంది. అయితే ఈ బ్యాగులపై పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బొమ్మను మాత్రమే ముద్రించారు. మైనార్టీ శాఖ మంత్రి అయిన పల్లె రఘునాథరెడ్డి చిత్రాన్ని ముద్రించలేదు. ఇదేమిటని ఇప్పటికే అధికారులను పల్లె నిలదీశారు. వారు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే పల్లె మాటలను పట్టించుకోవద్దని సునీత చెప్పినట్టు తెలుస్తోంది. అలా పల్లె బొమ్మ లేకుండానే కానుక పంపిణీ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన పల్లె రఘునాథరెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.