చిగుళ్లవ్యాధితో రొమ్ము క్యాన్సర్
రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో చిగుళ్ల వ్యాధి ఉంటే, అది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చిగుళ్లవాపు, చిగుళ్ల నుండి రక్తం రావడం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న మహిళల్లో, ఈ సమస్యలు లేని మహిళల్లో కంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని న్యూయార్క్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిగుళ్ల సమస్యకు గుండెజబ్బు, గుండెపోటు, మధుమేహం వ్యాధులతో సైతం సంబంధం ఉందని వారు చెబుతున్నారు. ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో చిగుళ్లవ్యాధికి నోరు, అన్నవాహిక, తల, మెడ, […]
రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో చిగుళ్ల వ్యాధి ఉంటే, అది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చిగుళ్లవాపు, చిగుళ్ల నుండి రక్తం రావడం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న మహిళల్లో, ఈ సమస్యలు లేని మహిళల్లో కంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని న్యూయార్క్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిగుళ్ల సమస్యకు గుండెజబ్బు, గుండెపోటు, మధుమేహం వ్యాధులతో సైతం సంబంధం ఉందని వారు చెబుతున్నారు.
ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో చిగుళ్లవ్యాధికి నోరు, అన్నవాహిక, తల, మెడ, పాంక్రియాస్, ఊపిరితిత్తుల భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు సంబంధముందని తేలగా, ఇప్పుడు నిర్వహించిన తాజా పరిశోధనల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు సైతం ఆస్కారముందని తేలిందని వారు చెప్పారు.
ఈ పరిశోధన నిమిత్తం మెనోపాజ్ దశలో ఉన్న 73,737మంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఎవరికీ అంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు లేవు. అయితే వీరిలో 26.1శాతం మందికి చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. 6.7 సంవత్సరాల పాటు వీరి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసి చూడగా వీరందరిలో 2,124 మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. వ్యాధికి గురయినవారిలో చిగుళ్ల సంబంధిత వ్యాధి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో పరిశీలించారు. ఈ పరిశోధన ఫలితాలను బట్టి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో చిగుళ్ల అనారోగ్యం ఉన్నపుడు వారు, ఆ సమస్య లేని వారికంటే 14 శాతం అధికంగా రొమ్ము క్యాన్సర్‌కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని తేల్చారు.