Telugu Global
Others

వేయండి వేటు... తీయండి ఆ రెండు వ్యూహాలు

అంగన్‌వాడీల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఆ వెంటనే కత్తి తీసింది. ఈనెల 18న చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు వచ్చిన అంగన్‌వాడీల దృశ్యాలను రికార్డు చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు వీడియోలు కూడా పంపారు. వాటి ఆధారంగా అంగన్‌వాడీలను గుర్తించి వేటు వేయాలని ఆదేశించారు. దీన్ని వల్ల దాదాపు 14 వేల మంది అంగన్‌వాడీ మహిళల మెడపై కత్తివేలాడుతోంది. అయితే ఇలా […]

వేయండి వేటు... తీయండి ఆ రెండు వ్యూహాలు
X

అంగన్‌వాడీల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఆ వెంటనే కత్తి తీసింది. ఈనెల 18న చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు వచ్చిన అంగన్‌వాడీల దృశ్యాలను రికార్డు చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు వీడియోలు కూడా పంపారు. వాటి ఆధారంగా అంగన్‌వాడీలను గుర్తించి వేటు వేయాలని ఆదేశించారు. దీన్ని వల్ల దాదాపు 14 వేల మంది అంగన్‌వాడీ మహిళల మెడపై కత్తివేలాడుతోంది. అయితే ఇలా వేటు వేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు.

చలో విజయవాడ సాకుగా చూపించి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన అంగన్‌వాడీలందరిని సాగనంపనున్నారని సమాచారం. వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా భావిస్తున్నారు. అంగన్‌వాడీలు నిత్యం గ్రామాల్లో తిరుగుతుంటారు కాబట్టి వారు టీడీపీకి అనుకూలమైన వారైతే ప్రభుత్వం తరపున సానుకూల ప్రచారం కూడా చేస్తారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అంగన్‌వాడీ సంఘం ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇది రూపుదిద్దుకోనుంది. ఎవరైనా అంగన్‌వాడీ మహిళగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ సంఘంలో చేర్చాల్చిన పరిస్థితిని కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ మహిళల ముందు ప్రభుత్వం రెండు దారులు ఉంచుతోంది. ఒకటి ఉద్యోగం పోగొట్టుకోవడం, రెండు టీడీపీ సంఘంలో చేరి ధర్నాలు, ఆందోళనకు దూరంగా ప్రభుత్వం చెప్పినట్టు బతకడం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకించే అంగన్‌వాడీలే ఉండకూడదన్నది ప్రభుత్వ ఎత్తుగడ.

First Published:  25 Dec 2015 6:56 AM IST
Next Story